అవును, ఆయన రాజకీయాల్లోకి వచ్చి నేటికీ 15 ఏళ్లు దాటిపోయింది. ఈ క్రమంలో ఆయన చదువుకు సంబంధించిన వివరాలు అప్పుడప్పుడు నెట్టింట వైరల్ కావడం మనం చూస్తూనే వున్నాం. తాజాగా నామినేషన్ పత్రంలో ఆ వివరాలను పవన్ మెన్షన్ చేయగా, ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే... ఎన్నికల్లో పోటీ చేయాలంటే విద్యార్హత అనేది ఉండాలనే నిబంధనంటూ ఏమీ లేదనేది అందరికీ తెలిసినదే. కానీ పవన్ ఇపుడు తన నామినేషన్లో తన విద్యార్హత మెన్షన్ చేయడంతో సర్వత్రా హాట్ టాపిక్ అయింది. పిఠాపురం అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తాను పదోతరగతి పాస్ అయినట్లు పవన్ చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక ఇంటర్మీడియేట్ అక్కడ ఎందుకు పేర్కొనలేదో అందరికీ తెలిసిన విషయమే.
ఇకపోతే, ఆయన ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లలలో అనేకమందిలో పవన్ విద్యార్హత గురించి అపుడపుడూ ఆసక్తి నెలకొంటూ ఉంటుంది. కాగా నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో 1984లో పదోతరగతి పూర్తి చేసినట్లు పవన్ ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడంతో అభిమానులకు ఓ క్లారిటీ వచ్చింది. ఇంటర్ తప్పడంతోనే ఆయన నిజాయితీగా దానిని మెన్షన్ చేయలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దానికి అభిమానులు మరోసారి తన నిజాయితీని బాస్ నిరూపించుకున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?