దక్షిణ భారతదేశంలో వెంకయ్య నాయుడు ఉన్నారు కానీ ఆయన ఒక క్లాస్ లీడర్. దీనివల్ల మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించలేకపోయారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి B.S. యడియూరప్ప బీజేపీని ఆ రాష్ట్రంలో గెలిపించగలిగారు. అయితే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఆయన తొక్కేయలేకపోయారు. రెండుసార్లు గెలిచినా రెండుసార్లు కూడా బీజేపీ స్వల్ప మెజారిటీతోనే గెలిచింది. ఆయన కారణంగా బీజేపీ కర్ణాటక రాష్ట్రంలో కొద్దిగా ప్రజాదరణ పొందగలిగిందేమో కానీ ఇతర రాష్ట్రాలలో పుంజుకోలేదు.
లోక్‌సభ అభ్యర్థి కె.అన్నామలై మాత్రం ఇప్పుడు బీజేపీని సౌత్ ఇండియాలో బలపరిచే విధంగా కనిపిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఈ నేత దక్షిణ భారతదేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. 39 ఏళ్ల ఈ నేత కోయంబత్తూర్ వంటి ప్రాంతాల్లో సమావేశాలు పెట్టగా లక్షలాదిమంది ప్రజలు తరలివచ్చారు. దీన్ని బట్టి ఆయన మంచి టెంపో క్రియేట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ నేత దక్షిణ భారతదేశంలో బిజెపికి దిక్సూచి లాగా నిలుస్తున్నారు. ఇలాంటి ఒక మాస్ లీడర్ కోసం బీజేపీ అధిష్టానం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. కె.అన్నామలై ఆ కోరికను నెరవేర్చే లాగా కనిపిస్తున్నారు. బీజేపీ సౌత్ ఇండియాలో కూడా బల్పడితే ఇక మోదీ ప్రభుత్వానికి తిరుగు ఉండదు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా సమావేశాలు పెట్టనున్నారు ఇక్కడ కూడా అదే రెస్పాన్స్ వస్తే ఆ నేత బిజెపిని తప్పనిసరిగా సౌత్ ఇండియాలో బలపరుస్తారని అర్థం చేసుకోవచ్చు.