ఇక మంగళగిరి రాజధాని అమరావతి పరిధిలో ఉంది. భూసేకరణ విషయంలో రైతుల్లో ఉన్న కోపం అప్పట్లో వైసీపీకి కొంత కలిసి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా రివర్స్ అయిపోయాయి. ఈ సారి కులం, మతం లాంటి సమీకరణలు ఇక్కడ ఏ మాత్రం ప్రభావం చూపే ఛాన్సులు అయితే కనపడడం లేదు. పైగా టీడీపీ – బీజేపీ – జనసేన కూటమిగా ఏర్పడటం, మంగళగిరిలో ఈ కూటమి ఈక్వేషన్ చాలా బలంగా ఉండడం కూడా లోకేష్‌కు కలిసి రానుంది.
ఇక లోకేష్ గత ఎన్నికల్లో ఓడిపోయినా ఐదేళ్ల పాటు ఇక్కడే బాగా ఫోకస్ పెట్టి నియోజకవర్గంలో గ్రౌండ్ లెవల్ వర్క్ బాగా చేసుకున్నారు. రాజధాని మార్పు ప్రభావంతో పాటు అమరావతిని ఐదేళ్లలో నిర్వీర్యం చేయడం కూడా లోకేష్‌కు బాగా కలిసి రానుంది. లోకేష్ గెలుపు విషయంలో ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు లేవు. అయితే మెజార్టీ ఎంత అన్నదాని గురించే సర్వేల్లో చర్చ నడుస్తోంది. జగన్ ఇక్కడ గట్టిగా ఫోకస్ పెట్టేసి టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మాజీ మంత్రి మరుగుడు హనుమంతరావుతో పాటు గంజి చిరంజీవి లాంటి వాళ్లను టీడీపీలోకి లాగేసినా... కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే ఆర్కేను తిరిగి పార్టీలోకి తీసుకు వచ్చినా ఉపయోగం లేదు.
ఆర్కేతో మొదలు పెట్టి గంజి చిరంజీవి ఇప్పుడు మురుగుడు లావణ్యను రంగంలోకి దించింది వైసీపీ. బీసీ పద్మశాలీ మహిళా అభ్యర్థి అన్న అంశమైనా కలిసొస్తుందన్నది జగన్ ప్లాన్. అయితే ఇక్కడ ప్రభుత్వం చేసిన విధ్వంసంతో అది కూడా ఏ మాత్రం కలిసి వచ్చేలా లేదు. కమ్మ, కాపు, రెడ్డి, చేనేత కార్మికుల ఓట్లు, దళిత ఓటు బ్యాంకు, ముస్లింలు.. ఇలా లెక్కలేసుకునే అవసరమే లేకుండా నారా లోకేష్, చాలా తేలిగ్గా మంగళగిరి నియోజకవర్గంలో గెలవబోతున్నారు. ఈ విషయాన్ని వైసీపీ వాళ్లే ఓపెన్‌గా చెప్పుకుంటున్నారు.. రేపటి ఎన్నికలు, కౌంటింగ్ కూడా లోకేష్ మెజార్టీ కోసమే అని చెప్పాలి.