ఈ క్రమంలోనే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతూన్నాయ్ అన్ని పార్టీలు. బిఆర్ఎస్ నుంచి మాజీ ఐఏఎస్ వెంకటరామిరెడ్డి ఇక బిజెపి నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థి నీలం మధు పోటీ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెదక్లో విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే మైనంపల్లి హనుమంతరావు ఇక నీలం మధు వెంటే ప్రచార నిర్వహిస్తున్నారు. అయితే మొన్నటికి మొన్న నామినేషన్ సమయంలో నీలం మధు కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రావడం హాట్ టాపిక్ గా మారిపోయింది.
సీఎం రేవంత్ రాకతో ఇక మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఇక కొత్త ఉత్సాహం నిండిపోయింది. అయితే రేవంత్ వచ్చినప్పుడు ఇక ఎంతలా జన సందోహం తరలి వచ్చారో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి తోడు పటాన్చెరులో కీలక నేతగా కొనసాగుతున్న కాటా శ్రీనివాస్, సంగారెడ్డి కాంగ్రెస్ కీలక నేత జగ్గారెడ్డి, ఇక మెదక్ లో మంచి పట్టున్న మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మైనంపల్లి రోహిత్ అందరూ కలిసి ఇక నీలం మధుని గెలిపించేందుకు సర్వశక్తులు ఓడ్డుతున్నారు. దానికి తోడు రేవంత్ నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంది. దీంతో ఇక కెసిఆర్ సొంత జిల్లాలోకాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంతమంది విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.