ఏపీలో ఎన్నికలకు మరి కొద్ది రోజులు మాత్రమే మిగిలి వుంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు తమదైన రీతిలో ప్రసారాలలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో జగన్ ని ఓడించడానికి కూటమి గూడిని ఏర్పాటు చేసుకున్న తెలుగు దేశం పార్టీ ఈసారి ఎలాగన్నా అధికారంలోకి రావాలని వ్యయ ప్రయాసలు పడుతున్నట్టుగా కనబడుతోంది. అవును, దానికోసం మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ని ఇపుడు టీడీపీ వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగానే కిషోర్ టీడీపీ అనుకూల స్టేట్‌మెంట్లు ఇస్తూ వస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి తలనొప్పిగా మారిన సొంత పార్టీ రెబల్స్‌ను బుజ్జగించేందుకు ఇపుడు ప్రశాంత్‌ కిషోర్‌ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడే పీకేకు ఘోరమైన అవమానం జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

విషయం అందరికీ తెలిసిందే, కూటమి పేరుతో టికెట్ల డ్రామా ఆడిన చంద్రబాబు.. ఆ పార్టీ సీనియర్లకు మొండి చేయి చూపిన సంగతి విదితమే. అందువలన సామాజిక వర్గాల ప్రతిపాదికన కూడా వారికి టికెట్లు ఇవ్వకపోవడం దారుణమంటూ కొందరు బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కారు. ఈ క్రమంలో చాలాచోట్ల ఆ పార్టీ నేతలు స్వతంత్రంగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా ఏప్రిల్‌ 29 వరకు గడువు ఉండడంతో.. వారిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి చివరి అస్త్రంగా ఈ ఎన్నికల్లో తమకు పని చేస్తున్న పీకేతో.. ఆ రెబల్స్‌కు చంద్రబాబు ఫోన్లు చేయిస్తున్నట్టు వినికిడి. ఈసారి ఎన్నికల్లో గెలుపు కష్టంగా ఉందని, పోటీ నుంచి తప్పుకుని కాస్తైనా పార్టీకి సహకరించాలని పీకే ఇప్పుడు వాళ్లను బతిమాలుతున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి.

అలా నామినేషన్లు వెనక్కి తీసుకున్న యెడల దానికి బదులుగా పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని, అవసరమైతే పదవులు కూడా ఇస్తుందని పీకే వారిని మభ్యపెట్టే యత్నం చేస్తున్నారట. అయితే.. ఈ క్రమంలోనే టీడీపీ నేతల నుంచి పీకేకు దిమ్మతిరిగే సమాధానాలు వస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానంనకు బదులుగా ఫోన్లు చేయడానికి మీరెవరంటూ ప్రశాంత్‌ కిషోర్‌ను వాళ్లు నిలదీస్తున్నారని సమాచారం. అంతేకాదు.. టీడీపీ ఇంకా అధికారంలోకే రాలేదని, అధికారంలోకి వచ్చేది అనుమానాలు ఉన్నప్పుడు పదవులు ఇస్తామని మీరెలా చెబుతున్నారంటూ నిలదీశారట. దీంతో భంగపడ్డ పీకే.. ఆ ఫోన్‌ సంభాషణల సారాంశాన్ని చంద్రబాబుకు చెప్పుకుని ఫీలైనట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: