ఏపీలో గత నెలలో సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల సంగతి, ఆ తర్వాత జరిగిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. అయితే మరోసారి అటువంటి పరిణామాలు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో జరిగిన దానిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అయినా మే1న ఠంచనుగా ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వాల్సి ఉండగా ఇవాళ అనగా 26వ తేదీ వచ్చినప్పటికీ ఇంకా అధికారులు మౌనంగా ఉండడం వలన అదే పరిస్థితులు మరలా పునరావృతం కానున్నాయని తెలుస్తోంది. దీంతో పెన్షన్ల పంపిణీ మే1న జరుగుతుందా లేదా అనే టెన్షన్ ఇపుడు జనాల్లో నెలకొంటోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం ఈసీ జోక్యం చేసుకుని ఈసారి సకాలంలో పెన్షన్లు ఇంటి వద్దే పంపిణీ చేసేలా మరోసారి ఉత్తర్వులు ఇవ్వాలని కోరడం కొసమెరుపు.

ఇకపోతే గత నెలలో పెన్షన్లను సచివాలయానికి వచ్చి తీసుకోవాలని అధికారులు చెప్పేయడంతో వృద్ధులు అనేకమంది చాలా ఇబ్బందులు పడిన వైనం అందరికీ తెలిసినదే. మండు వేసవిలో సచివాలయాలకు రాలేక, వచ్చినా అక్కడ వేచి చూసే పరిస్ధితి ఇపుడు లేదు. పైగా జనాలు ఇంటివద్దే సౌకర్యంగా పెన్షన్ తీసుకోవడానికి అలవాటు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యాలయాలకు వెళ్లి తీసుకోవాలని ఎవరనుకుంటారు? ఇక అదే అదనుగా చేసుకొని వైసీపీ శ్రేణులు వారిని మంచాలపై సచివాలయాలకు మోసుకొచ్చి ప్రచారం కోసం ప్రయత్నించారు. అది వారికి బాగా అనుకూలించినట్టు కనబడుతోంది. ఎందుకంటే ఇపుడు వృద్ధులందరూ వైసీపీ వైపు మళ్లారు.

ఇక ఇటువంటి వరిస్థితుల్లో ఈ విషయాన్ని చక్కదిద్దుకోకపోతే రాబోయే ఎలక్షన్లో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం కలదు. ఇలాంటి పరిస్థితుల్లో ముందే ఉతత్తర్వులు వస్తాయని చాలామంది అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. దీంతో పింఛన్ దారులకు మే 1 టెన్షన్ పట్టుకుంది. అయితే మరో రెండు మూడు రోజుల్లో ఈ విషయమై ఎదో ఒక అప్డేట్ రాకపోదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి అప్డేట్ వచ్చినప్పటికీ అది వృద్ధులకు అనుకూలంగా వస్తే అదే చాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap