అంతేకాదు.. తమ తమ రాజకీయ ప్రసంగాల్లోనూ జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్ర బాబు కూడా.. మే 1వ తారీకు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి కారణం.. ప్రతి నెలా ఒకటో తేదీన రాష్ట్రంలో జరిగే సామాజిక భద్రతగా పింఛన్ల పంపిణీనే. ప్రస్తుతం వలం టీర్ వ్యవస్థను ఎన్నికలు ముగిసి.. ఫలితం వచ్చే వరకు కూడా సస్పెండ్ చేయడంతో.. పింఛన్ల పంపిణీ తీవ్రస్థాయిలో వివాదంగా మారింది.
ముఖ్యంగా ఏప్రిల్ 1-9వ తేదీలమధ్య పింఛన్ల పంపిణీ అంశం.. రాజకీయంగా కూటమి పార్టీలకు పెను ఇ బ్బందిగా మారింది. ఇంటింటికీ పంపిణీ చేయలేక పోవడం.. దీంతో వృద్ధులు, దివ్యాంగులు రోడ్డు వెంబడి కిలో మీటర్లు నడుచుకుని వచ్చి.. సచివాలయ కేంద్రాల్లో తీసుకోవడం.. ఈక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది వృద్ధులు మరణించడం.. పెను రాజకీయ వివాదానికి దారితీసింది. దీని నుంచి బయట పడేందు కు చంద్రబాబు నానా తిప్పలు పడ్డారు.
ఈ నేపథ్యంలో మే 1వ తేదీన పంపిణీ కావాల్సిన పింఛన్ల వ్యవహారం.. ఇప్పుడు కూటమి పార్టీలకు టెన్షన్ పెడుతోంది. ఏ కారణంతో అయినా.. ఆ రోజు కనుక పింఛన్ల పంపిణీ ఇంటింటికీ జరగకపోతే.. అది చంద్రబాబు కారణమనే వాదనను వైసీపీ తెరమీదికి తెచ్చి ప్రచారం చేస్తుంది. ఇది అంతిమంగా.. మే 13న జరిగే పోలింగ్‌పై ప్రభావం చూపించే అవకాశంఉంటుందని కూటమి పార్టీలు భావిస్తున్నారు.
దీంతో పవన్ ఏకంగా.. మే 1న పింఛన్లు పంపిణీ కాకపోతే.. దానికి వైసీపీ కుట్ర ఉందని భావస్తామన్నారు. చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ సీఎస్‌కు కూడా లేఖలు సంధించారు. మొత్తంగా రాష్ట్ర సమ స్యల కంటే కూడా.. పింఛన్ల పంపిణీపై ప్రతిపక్ష కూటమి దిగులు పెట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుండ డం గమనార్హం.