ఈ యాగ ఫలితం ఆధారంగా బాలయ్య హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురైనా సునాయాసంగా విజయం సాధించారు. ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఈ యాగం చేయించగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో సైతం హిందూపురం నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది.
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బాలయ్య మళ్లీ అలాంటి యాగం చేయించారో లేదో పూర్తిస్థాయిలో సమాచారం అందాల్సి ఉంది. ఫోన్ కాల్ మాట్లాడాల్సి వచ్చినా బాలయ్య మూహూర్తాలను పరిశీలిస్తారని తెలుస్తోంది. ఈ విషయంలో బాలయ్యకు బాలయ్యే సాటి అని నియమ నిబంధనలు ఫాలో అయ్యే విషయంలో బాలయ్యకు ఎవరూ సాటిరారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హిందూపురంలో బాలయ్య మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారో లేదో చూడాల్సి ఉంది. ఒకవేళ ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలిస్తే మాత్రం భవిష్యత్తులో సైతం టీడీపీ పుంజుకోవడం కష్టమవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఏ పార్టీకి షాకులు ఇవ్వబోతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. సర్వేల ఫలితాలు సైతం టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పడానికి బదులుగా కొన్ని కూటమిదే విజయం అని చెబుతుంటే మరికొన్ని వైసీపీదే విజయం అని చెబుతున్నాయి. రాయలసీమలో కొంతమేర వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉండటం ఆ పార్టీకి మరింత ప్లస్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. సీమ జిల్లాలలో వైసీపీ 75 శాతం సీట్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.