వైయస్ షర్మిల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరున్నటువంటి రాజకీయ నాయకురాలు. తండ్రి రాజశేఖర్ రెడ్డి అండతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె  ఇప్పటికి కూడా ఎక్కడ నిలదొక్కుకోలేకపోతోంది. పోయిన ఎన్నికలకు ముందు తెలంగాణలో వైఎస్ఆర్టిపి పార్టీ స్థాపించి తెలంగాణ అంతా చక్కర్లు కొట్టింది.  నేను మీ రాజన్న బిడ్డని తెలంగాణ కోడలిని అని చెబుతూ  తిరిగినా కానీ ఇక్కడి ప్రజలు ఆమెను కనీసం పట్టించుకోలేదు. ఇది వర్కవుట్ అవ్వడం లేదని చెప్పి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ గా పదవి చేపట్టింది. తన అన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ  రాజకీయాలు చేస్తుందని చెప్పవచ్చు. 

ఇన్ని చేసిన షర్మిలకు ఏది కూడా వర్కవుట్ అవ్వడం లేదు.ఏపీ ఎన్నికల ప్రచారంలో శవ రాజకీయాలు చేయడం వల్ల చాలామంది  ఈమెను విమర్శిస్తున్నారు. తాజాగా జేడీ లక్ష్మీనారాయణ కూడా  షర్మిల మాట్లాడిన మాటలకు షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. షర్మిల వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు గురించే తరచూ ప్రస్తావిస్తూ ఏదో తనకు నిజాలు తెలుసు అన్నట్టు మాట్లాడుతోంది. తాజాగా షర్మిల మాట్లాడుతూ  సుధాకర్ రెడ్డే రాజశేఖర్ రెడ్డి గారి పేరు  ఎఫ్ఐఆర్ లో పెట్టించారని చెప్పింది. నిజానికి ఒక లాయర్ వెళ్లి పేరు చెబితే ఎఫ్ఐఆర్ లో పెట్టేస్తారా  అనేది ప్రధాన ప్రశ్న.

దీనిపై స్పందించిన జెడి లక్ష్మీనారాయణ చార్జి సీట్లో ఎవరో చెప్పారని పిటిషన్లు వేస్తే పెట్టరని విచారణలో మాత్రమే  పేర్లు పెడతారని అన్నారు. ఈ విధంగా షర్మిల తన తండ్రి చావు మీద కూడా రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె వ్యూహాలన్నీ బెడిసి కొడుతున్నాయి. ఈ విధమైన రాజకీయం చేయకుండా తన తండ్రి ఆస్తిలో వాటా వస్తుందని, తన అన్న తనకు ఇవ్వడం లేదని కొట్లాడితే బాగుండేది. ప్రతి ఆడపిల్లకు తండ్రి ఆస్తులు అన్నతో సమానంగా  ఉంటుందని కొట్లాడి ఉంటే రాష్ట్రంలోని ఆడపిల్లలు అందరూ తనకు సపోర్ట్ చేసి ఓట్లు వేసే వారేమో. ఏదైనా వర్గానికి ఉపయోగపడే రాజకీయం చేయకుండా  తండ్రి, బాబాయ్ చావులపై రాజకీయాలు చేస్తూ అబద్దాన్ని నిజంగా వర్ణించే ప్రయత్నం చేస్తుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు షర్మిలను తిట్టిపోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: