ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టాయి. విడిగా పోటీ చేసే కంటే కూటమిగా పోటీ చేస్తే విజయావకాశాలు పెరుగుతాయని అంతా భావిస్తున్నారు. గతంలో సైతం ఇలా కూటమి కట్టడంతో విజయం సాధించిన అనుభవం ఉంది. కూటమి కట్టకుండా ఉండడానికి వైసీపీ నేతలు పలు విమర్శలు చేశారు. సీట్లు తగ్గించుకుని పవన్ మూడు పార్టీల కూటమికి బాటలు వేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో ఆయన వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. తన కుటుంబం గురించి వ్యక్తిగత విమర్శలు చేస్తున్న జగన్‌కు అదే రీతిలో గట్టిగా బదులిస్తున్నారు. బాబాయి హత్యకు పాల్పడింది ఎవరో చెప్పాలని నిలదీస్తున్నారు. చంద్రబాబుతో కలిసి పవన్ ఈ నెల ఈ నెల 24, 25 తేదీల్లో కడప జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జగన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోర్టు పరిధిలో ఉన్న వైఎస్ వివేకా హత్య అంశాన్ని జగన్‌కు ఆపాదించి, రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నారని వివరించారు. ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.