ప్రస్తుతకాలంలో ఎలక్షన్స్  డిఫరెంట్ గా జరుగుతున్నాయి. గత 20 సంవత్సరాల క్రింది ఎలక్షన్స్ కు ఇప్పటి ఎలక్షన్స్ కు ఎంతో తేడా ఉంది. ప్రస్తుత కాలంలో జరిగే ఎలక్షన్స్ లో  ఉచిత పథకాల పేరుతో ప్రజలని సోమరిపోతులను చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు.  ఇలా ఉచితాలు అమలు చేసుకుంటూ పోతే ఏదైనా విపత్తులు ఏర్పడినప్పుడు  ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడానికి కనీస సొమ్ము కూడా ఉండదు. ప్రస్తుత కాలంలో చాలా రాజకీయ పార్టీలు ఒక పార్టీకి మించి మరో పార్టీ హామీలలో దూసుకుపోతోంది. ఈ మధ్యకాలంలో  తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పింఛన్లు బీఆర్ఎస్ ఇంతకుముందు ఉన్న ఫించన్ కు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పింది. 

కాంగ్రెస్ ప్రభుత్వం  కామన్ వ్యక్తులకు 4000 వికలాంగుల 6 వేలు ఇస్తామని చెప్పింది. ఈ విధంగా ఓట్ల కోసమే ఉచితాలు ప్రకటిస్తున్నారు తప్ప ప్రజల శ్రేయస్సు మాత్రం ఇందులో కనిపించడం లేదు. కేవలం పింఛన్లు ఇచ్చి మిగతా వ్యవస్థలన్నీ  కుంటుపడేలా చేస్తున్నారు. యువతకు ఉద్యోగ కల్పనలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు. రాష్ట్రాలకు ఫ్యాక్టరీలు తీసుకురావడంలో కూడా విఫలమవుతున్నారు. వీరు ఇచ్చే పింఛన్లు  కేవలం ఇంట్లో కూర్చుని ఉన్నవాళ్ళకు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప భవిష్యత్తు తరాలలో దేశానికి ఉపయోగపడే యువతకు ఏ మాత్రం ఉపయోగపడవు అనేది జగమెరిగిన సత్యం. ఇంట్లో ముసలి వాళ్లకు అంత పింఛన్ ఇచ్చే బదులు ఆ ఇంట్లో చదువుకున్న యువకుడికి ఉద్యోగ అవకాశం కల్పిస్తే ఇంట్లో ఉన్నవాళ్లందరినీ ఆయనే సాకుతారు కదా.

కేవలం ఫించనులే కాకుండా ఇంకా మరెన్నో పథకాలు తీసుకువచ్చి విపరీతమైన అప్పులు చేసి ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారు. అయితే తాజాగా  ఏపీ ఎలక్షన్స్ లో కూడా  చంద్రబాబు ఏకంగా నాలుగు వేల పింఛను ఇస్తానంటే జగన్ 3500 ఇస్తానని ఒప్పుకున్నారు. ఇలా ఒకరికి మించి మరొకరు హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. దీనివల్ల భవిష్యత్ తరాల జీవితాలు  ఆందోళనకరంగా మారుతాయని  తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచించండి నాకు కావలసింది ఉచిత పథకాలు కాదు, ఉపాధి కల్పన. ఉపాధి ఉంటే ఎవరి కుటుంబాన్ని వారు చక్కగా సాదుకోవచ్చు హ్యాపీగా జీవించవచ్చు. ప్రభుత్వాలు కూడా ఇంత ధరలు పెంచాల్సిన అవసరం కూడా రాదు. మనకు ఉద్యోగ కల్పన కల్పించే ప్రభుత్వాలను ఎన్నుకుందాం  భవిష్యత్ తరాలకు కూడా  ఈ భూమిపై భవిష్యత్తు ఉండేలా చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: