ఇక ఈసారి కూడా అటు డమ్మీ అభ్యర్థులనే మిగతా పార్టీలు నిలబెట్టాయని అందరూ అనుకుంటుండగా.. బీజేపీ మాత్రం ఎంఐ కంచుకోటను బద్దలు కొట్టి ఇక హైదరాబాద్ గడ్డమీద కాషాయ జెండా ఎగర వెయ్యాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే బిజెపి అభ్యర్థిగా మాధవి లతను బరిలోకి దింపింది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని నియోజకవర్గాలలో కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందరు నేతలను కలుపుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక తనదైన శైలి ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు అని చెప్పాలి. అంతేకాదు ప్రజలందరికీ స్పష్టమైన హామీలు ఇస్తున్నారు.
ఇలా బిజెపి అభ్యర్థి మాధవి లత మజిలీస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు పర్వం తీవ్రస్థాయిలో జరుగుతుంది. అయితే ఇటీవల ప్రచార నిర్వహించిన మాధవి లత మజిలీస్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓవైసీ మతం, గోమాంసం ఈ రెండు విషయాల గురించి మాట్లాడుతారు. ఎన్నికల ముంగిట పబ్లిక్ లో గోవధ చేసి, గొడ్డు మాంసం తినాలి అని పిలుపునిస్తున్న వారిపై ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఓవైసీ ఎప్పుడు కూడా ఆయన మానిఫెస్టో గురించి అసలు మాట్లాడరు. న్యాయవాది అయిన ఓవైసీ ఇలా మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది అంటూ మాధవి లత విమర్శలు గుప్పించారు.