ఇటీవల నిన్నటి రోజున వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది వైసిపి పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి.. అయితే ఇందులో అన్ని వర్గాలకు మేలు చేసేలా మేనిఫెస్టోని విడుదల చేశారు.. మైనారిటీ సబ్ ప్లాన్ అమలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా ఉంటుందంటూ పలువురు ముస్లిం నేతలు ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. ముస్లింల హక్కుల పరిమితి రాష్ట్ర అధ్యక్షురాలు షేక్ నాగుల్ మీరా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది.


2019-24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కాంపోనెంట్ చట్టన్ని పారదర్శకంగానే అమలు చేశారనే  విషయం పైన జగన్ను ప్రశంసించాలంటూ తెలియజేశారు..DBT..NON DBT ద్వారా ముస్లిం మైనార్టీల కోసం 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలియజేశారు. ఇంత పెద్ద మొత్తంలో ముస్లింలకు కేటాయించడం ఎప్పుడూ కూడా జరగలేదంటూ ముస్లింల సంక్షేమానికి ఖర్చు చేసింది సీఎం జగన్ మాత్రమే అంటూ తెలియజేశారు షేక్ నాగుల్ మీరా.. 2019లో అమలైన ప్రతి పథకాన్ని కూడా అలాగే 2024లో కూడా అమలు చేస్తానని చెప్పారు సీఎం జగన్.


ఈ నిర్ణయం ద్వారా మరొకసారి తన విశ్వాసనీయత రుజువు అయ్యిందంటూ కూడా తెలియజేశారు. గతంలో దివంగత నేత వైయస్సార్ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చారని తన కుమారుడు ఆ రిజర్వేషన్లను కొనసాగిస్తూ మైనారిటీ సంక్షేమం కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేశారు. అయితే కూటమి ఇటీవలే అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని కూడా చెబుతున్నారు. అలాంటివారికి తమ వర్గం నుంచి ఒక్క ఓటు కూడా పడదు అంటూ పలువురు నేతలు ముస్లిసు తెలియజేస్తున్నారు. టిడిపి జనసేన పార్టీ అంటే తమకు ఎలాంటి ఇబ్బందులు లేదని.. కానీ బిజెపి పార్టీతో కూటమి చేయడం వల్ల చాలామంది నేతలు వీరిని విమర్శిస్తున్నారు. గత కొన్ని నెలలుగా మైనార్టీల రిజర్వేషన్లను తీసివేసేందుకు  బిజెపి పార్టీ కుట్రలు పడుతోందంటూ కూడా ముస్లిం నేతలు తెలియజేస్తున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే కచ్చితంగా కూటమికి ఆంధ్రాలో దెబ్బ పడేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: