- నిన్న‌టి వ‌ర‌కు ఫ్యాన్ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి నేడు టీడీపీ పార్ల‌మెంటు క్యాండెట్‌
- నెల్లూరులో ఆస‌క్తిగా మారిన ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యుల స‌మ‌రం
- వేమిరెడ్డితో పాటు అసెంబ్లీకి భార్య ప్ర‌శాంతి కూడా పోటీ

( నెల్లూరు - ఇండియా హెరాల్డ్ )

సింహపురి అని పిలుచుకునే నెల్లూరు పార్లమెంట్ స్థానంలో ఈసారి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. నిన్న మొన్నటి వరకు నెల్లూరు పార్లమెంటు సీటు నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారు.. అసలు టీడీపీకి ఇక్కడ బలమైన అభ్యర్థి ఉంటారా ? అన్న చర్చ‌ నడిచింది. అలాంటి టైంలో వైసీపీలో అప్పటివరకు రాజ్యసభ సభ్యుడుగా ఉన్న ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ prabhakar REDDY' target='_blank' title='వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిల్ ఎక్కేయటం.. చంద్రబాబు ఆయనకు నెల్లూరు పార్లమెంటు సీటుతో పాటు ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి కోవూరు సీటు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.


వేమిరెడ్డి పార్టీ మారడంతో వైసీపీకి బలమైన అభ్యర్థి లేకుండా పోయారు. ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న ఆధార ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. దీంతో జగన్ రాజ్యసభ సభ్యుడుగా ఉన్న వేణుంబాక విజయసాయిరెడ్డిని బలవంతంగా నెల్లూరు నుంచి పార్లమెంటుకు పోటీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మామూలుగా నిన్నటి వరకు వేమిరెడ్డి, విజయసాయిరెడ్డి ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ ఇప్పుడు పార్లమెంటుకు వేరువేరు పార్టీల నుంచి పోటీపడుతున్నా వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం లేదు.


అయితే నెల్లూరు పార్లమెంటు పరిధిలో పోటీపడుతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. నెల్లూరు పార్లమెంట్‌లో వైసీపీ బలంగా ఉన్న ప్రభాకర్ రెడ్డికి.. వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, ఆయన చేసిన సేవలు, ఆయనకు ఉన్న మంచి పేరు నేపథ్యంలో ఈసారి ఇక్కడ భారీగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. చివరకు విజయ్ సాయి రెడ్డి సైతం ఈ ఎన్నికలలో ఎవరు గెలిచిన మేమిద్దరం గెలిచినట్టే అనే వ్యాఖ్యలు చేస్తున్నారు.. అంటే వైసీపీ వాళ్లకు సైతం వేమిరెడ్డిని విమర్శించడం పెద్దగా ఇష్టం లేదనే చెప్పాలి.


ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వీరులో ఇద్దరికి టీడీపీ టికెట్లు కేటాయించింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఈసారి నరసరావుపేట పార్లమెంటుకు బదిలీ అయ్యారు. ఆయన సొంత బాబాయ్ కూడా ఇప్పుడు టీడీపీలో చేరారు. నెల్లూరుకు చెందిన‌ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా ఇప్పుడు టీడీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇలా నెల్లూరు పెద్దారెడ్లు అంతా ఇప్పుడు టీడీపీ కూటమికి మద్దతు ఇస్తున్నారు అన్నది బహిరంగ రహస్యం. దీంతో ఈసారి నెల్లూరు పార్లమెంటులో అనూహ్య‌ పలితాలు రాబోతున్నాయి అన్న చర్చలు అయితే మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: