ఏపీ సీఎం వైఎస్ జగన్ గాయం విషయంలో సోషల్ మీడియా వేదికగా టీడీపీ చేస్తున్న రచ్చ అంతాఇంతా కాదు. కొన్నిరోజుల క్రితం వరకు జగన్ బ్యాండేజ్ తీసేయాలని రచ్చ చేసిన టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు మాత్రం గాయం మాయమైందంటూ ప్రచారం చేస్తోంది. అసలు రాయి తగిలిందా అంటూ ఒక పచ్చ పత్రిక, టీడీపీ చేస్తున్న ఓవరాక్షన్ మాత్రం అంతాఇంతా కాదు. జగన్ పై మరీ ఇంతలా దిగజారి పగ సాధించాలా అంటూ వైసీపీ శ్రేణులు కామెంట్లు చేస్తున్నారు.
 
జగన్ ముఖంపై చిన్న గాయం కూడా లేదని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నా వాస్తవానికి జగన్ ముఖంపై గాయం గుర్తులు అలాగే ఉన్నాయి. అయితే మరీ దూరం నుంచి చూస్తే మాత్రం జగన్ ముఖంపై ఆ గాయం గుర్తులు కనిపించే అవకాశం అయితే లేదు. జగన్ పై దాడికి కారణమైన వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసని దాడి ఘటన గురించి పదేపదే ప్రస్తావిస్తే కూటమికే నష్టమని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
జగన్ గాయం విషయంలో కూటమి వెకిలి ప్రచారంపై న్యూట్రల్ ఓటర్లు సైతం మండిపడుతున్నారు. జగన్ పై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే సతీష్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏ2 ప్రోద్బలంతో సతీష్ దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నా ఇప్పటివరకు ఈ కేసులో ఏ2 ఎవరనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకలేదు. ఎన్నికల సమయానికి ఈ కేసులో మరిన్ని మలుపులు చోటు చేసుకుంటాయేమో చూడాలి.
 
జగన్ గాయం స్పష్టంగా కనిపిస్తోందని కళ్లు తెరిచి చూడాలని నెగిటివ్ కామెంట్లకు జగన్ అభిమానులు ధీటుగా బదులిస్తున్నారు. అనవసరంగా జగన్ ను కించపరిచే ప్రయత్నం చేయవద్దని వైసీపీ కార్యకర్తలు, నేతలు కోరుతున్నారు. ప్రతి విషయంలో జగన్ ను మరీ దారుణంగా టార్గెట్ చేయడం పద్ధతి కాదని వైసీపీ నేతల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్లస్ హామీలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: