ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సైతం ఈసారి హోరాహోరీగా ఉండనున్నాయి.. ముఖ్యంగా కూటమిలో భాగంగా టిడిపి బిజెపి జనసేన పార్టీలు మూకుమ్మడిగా వైసిపి పార్టీని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. నిన్నటి రోజున వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది జగన్.. అయితే ఈ మేనిఫెస్టో కంటే మా మేనిఫెస్టోని బెటర్ అంటూ టిడిపి నేత చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు.. అయితే గతంలో ఇచ్చినటువంటి హామీలను సైతం 99% నెరవేర్చామంటూ సీఎం జగన్ తెలియజేశారు. వాటిని మరింత రూపుదిద్దుకొని ఈసారి ముందుకు తీసుకువెళ్లాలని చూస్తున్నామంటూ వెల్లడించారు.



అయితే కూటానికి సంబంధించి మేనిఫెస్టో సూపర్ సిక్స్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఏమి యాడ్ చేస్తారనే విషయం ఇంకా తెలియలేదు.. తాజాగా జగన్ గారు విడిచినటువంటి మేనిఫెస్టో తర్వాత చంద్రబాబు మాట్లాడడం జరిగింది. ఎన్నికలకు ముందే జగన్ ఆస్త సన్యాసం చేశారని కూటమి మేనుపోస్టో సూపర్ హిట్ వైసిపి పార్టీ మేనిఫెస్టో ఫట్ అన్నట్టుగా తెలియజేశారు. ఆల్రెడీ మాది సూపర్ హిట్ అయిపోయింది అన్నట్టుగా తెలిపారు. టిడిపి మేనిఫెస్టోలో అద్భుతాలు చూపెట్టడానికి ముఖ్యంగా పెన్షన్ 4000.. వికలాంగులకు 6000 రూపాయల పింఛన్ పెంపు.


రైతులకు 20వేల రూపాయలు.. 18 ఏలు నిండిన మహిళలకు 1500 రూపాయలు.. ఇలాంటి వాటితో పాటుగా భారీ మేనిఫెస్టోతో సిద్ధమవుతున్నారు టిడిపి పార్టీ. సూపర్ సిక్స్ కి అదనంగా యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సూపర్ హిట్ అయ్యేటువంటి కోణంలోనే మేనిఫెస్టోను రూపొందించేలా కూటమి ప్లాన్ చేస్తోంది.. ఈ విషయాలను పార్టీ నేతలు కూడా తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు కూటమి మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.. అయితే గతంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలను నెరవేర్చలేదని రూమర్ కూడా ఉన్నది.. మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చూడాలి మరి. ఒకవేళ తీసుకున్న ప్రజలు వీటిని నమ్ముతారా లేదా అనే విషయం పైన కూడా ఆధారపడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: