ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకటించిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యమేనా అనే చర్చ లేని మేనిఫెస్టో అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ చెప్పిందే చేస్తాడని చేసేదే చెప్తాడని సామాన్యులు చెబుతున్నారు. ప్రజలలో తనపై, తన పాలనపై విశ్వసనీయత ఉందని జగన్ ఫీలవుతున్నారు. ఈ ఎన్నికల్లో 88 సీట్లు సాధించడం కష్టం కాదని ఆయన భావిస్తున్నారు.
 
జగన్ ప్రకటించిన మేనిఫెస్టో వైసీపీకి శ్రీరామరక్ష అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మేనిఫెస్టో అంటే వైసీపీ పవిత్ర గ్రంథంలా భావిస్తుందని ప్రజల్లో సైతం నమ్మకం ఉంది. అయితే ఇప్పటికీ వైసీపీ మేనిఫెస్టో విషయంలో 20 నుంచి 30 శాతం మంది ప్రజల్లో అసంతృప్తి ఉంది. అరచేతిలో వైకుంఠం చూపి ప్రజల్ని మోసం చేయడానికి బదులుగా జగన్ మాత్రం వాస్తవ పరిస్థితులను బట్టి హామీల అమలను ప్రకటించారు. రాబోయే రోజుల్లో ప్రచార సభలలో కూటమి మేనిఫెస్టో డొల్ల అని జగన్ ప్రూవ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విధంగా చేయడం ద్వారా అసంతృప్తికి చెక్ పెట్టడంతో పాటు గెలుపుపై వైసీపీ శ్రేణుల్లో జగన్ ధీమా పెంచనున్నారని భోగట్టా.
 
రైతు రుణమాఫీని ప్రకటించి అధికారంలోకి వచ్చిన ఇతర రాష్ట్రాలలో పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రుణమాఫీ హామీని అమలు చేయాలంటే ఇతర పథకాలకు డబ్బులను కేటాయించే పరిస్థితి ఉండదు. డ్వాక్రా రుణమాఫీ ప్రకటిస్తే ఆ హామీ కూడా ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.
 
కూటమి గెలిచినా ఓడినా చంద్రబాబు నాయుడుకు ఇదే చివరి అవకాశం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కారణం వల్లే చంద్రబాబు హామీల అమలు సాధ్యం అవుతుందో లేదో కూడా పట్టించుకోకుండా నచ్చిన హామీలను ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. అమలు చేయడం సాధ్యం కాని హామీలను ప్రకటిస్తే ఎంత ప్రకటించకపోతే ఎంత అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ భవిష్యత్తులో మరిన్ని కొత్త హామీలను సైతం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని బడ్జెట్ సహకరిస్తే ప్రజలకు బెనిఫిట్ కలిగేలా ఎంతైనా చేయాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: