మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిలేషన్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. సినిమా రంగంలో పతాక స్థాయిని చేరుకున్న వీరు రాజకీయంలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ 'ప్రజారాజ్యం' అనే పార్టీ పెట్టి ఆ తరువాత కొన్ని పరిస్థితుల వలన కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి విదితమే. ఇక ఆ తరువాత ఆయన సినిమాలకే పరిమితం అయ్యారు. ఆ తరువాత కాలంలో చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ 'జనసేన' అనే పార్టీని స్థాపించి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఘోర ఓటమి పాలయ్యారు. కానీ నాటినుండి నేటివరకు ఆయన పార్టీని వీడిన దాఖలాలు లేవు, సరికదా మరింత జోష్ తో ముందుకు పోతున్నాడు.

పాలిటిక్స్ తనకి సరిపడవని తరువాత సినిమాలకే కేవలం పరిమితం అయిన చిరు గడిచిన పదేళ్లలో ఎప్పుడూ తమ్ముడు పార్టీ జనసేనకి సపోర్ట్ చేసిన సందర్భం లేదు. అయితే ఈసారి 2024 ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి కూటమిగా పోటీ చేస్తున్న తరుణంలో పార్టీ కోసం చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికలకు దగ్గర పడుతుండడంతో ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన తరపున మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేయనున్నారు. అవును, మీరు విన్నది నిజం... ఈ విషయాన్ని ఆ పార్టీ నేత యాక్టర్ పృథ్వీ వెల్లడించారు.

మే 5 నుంచి 11 వరకు జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారని ఆయన ఈ సందర్భంగా తెలియజేసారు. కూటమి అభ్యర్థులు ఈసారి ఖచ్చితంగా గెలవాలని షూటింగ్ పక్కన పెట్టి మరీ ప్రచారం చేయనున్నారు. అయితే మెగాస్టార్ ఇదివరకే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపొతే నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో బహిరంగ సభలో పాల్గొని రాత్రి 7 గంటలకు తాడేపల్లిగూడెం గొల్లగూడెం సెంటర్లో బహిరంగ సభలో పాల్గోనున్నారు. తరువాత రేపు పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో పర్యటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: