తాజాగా మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అటు అధికార పార్టీ వైసీపీ ఇటు ప్రతిపక్ష పార్టీ టిడిపి పోటాపోటీగా తామే అధికారంలోకి వస్తామని ప్రగల్బాలు పలుకుతున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే మేనిఫెస్టోలను ప్రకటిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే కొన్ని సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి .ఇక తాజాగా ఒక సర్వే ఏపీ రాజకీయాలలో వేడి పుట్టిస్తోంది.

ఇక తాజాగా ఏ ఎల్ ఎన్ సర్వే పేరిట ఒక సర్వే నిర్వహించగా ..ఇది దాదాపుగా వైసీపీకే అనుకూలంగా ప్రకటించడం గమనార్హం. ఒక్కొక్క నియోజకవర్గ నుండి 550 శాంపిల్స్ తీసిన వీరు.. ఇందులో వైయస్సార్ పార్టీకి 51% ఓట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీకి 41 శాతం ఓట్లు వస్తాయని , ఐ ఎన్ డి ఐ ఏ కూటమికి నాలుగు శాతం ఓట్లు వస్తాయని.. తాజా సర్వే వెల్లడించింది.. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. గత ఏడాదితో పోల్చుకుంటే.. వైసిపి 50 నుంచి ఒక శాతం పెరుగుతుంది.. టిడిపి 40 నుంచి ఒక శాతం పెరుగుతుంది.. జనసేన ఆరు , బిజెపి ఒకటి కలిపితే 7 అవ్వాలి.. అంటే 47 కాస్త 41శాతం  మాత్రమే అవుతుందని.. ఐ ఎన్ డి ఐ ఏ కూటమికి గత ఏడాది ఒక శాతం మాత్రమే ఓటు రాగా.. ఇప్పుడు నాలుగు శాతం పెరుగుతుందని అక్కడ సర్వే తెలిపింది.

మెజారిటీ పరంగా చూసుకుంటున్నట్లయితే వైసీపీకి 10 వేల ఓట్ల అధిక  మెజారిటీతో 79 సీట్లు గెలుస్తుందని, అలాగే 5000 నుంచి 10000 మెజారిటీతో 57 సీట్లు గెలుస్తుందని, 5000 లోపు మెజారిటీతో 13 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. మొత్తంగా చూసుకుంటే వైఎస్ఆర్ పార్టీకి 149 సీట్లు వస్తాయని ఈ తాజా సర్వే వెల్లడించింది. తెలుగుదేశం పార్టీకి 26 సీట్లు వస్తాయని ఈ సర్వే వారు అంచనా వేస్తున్నారు. ఇక ఇలా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎవరికి వారు సర్వేల రూపంలో ఏ పార్టీకి అనుకూలంగా ఓటర్లు ఉన్నారు అనే విషయాన్ని వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: