ఇలా మీ జీవితాలను అంధకారంలోకి నెట్టేసిన ఈ దుర్మార్గుడికి మళ్లీ ఓటేస్తారా చెప్పండి? జగన్ గారడీ మాటలకు మళ్లీ మోసపోతే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు? మిమ్మల్ని కాపాడడం కోసం మేము ఒక కూటమిగా తయారై ఈనాడు మీ ముందుకొచ్చాము అంటూ మాట్లాడారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... "టీడీపీ కూటమిని గెలిపిస్తే పనుల కోసం మీరు ఇతర రాష్ట్రాలకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇతర రాష్ట్రాలనుండే ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోను జూన్ 4 తర్వాత మనం ప్రభుత్వం స్థాపిస్తున్నాం. సంపద సృష్టించి పేదల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నేను తీసుకుంటాను. పవన్ అన్యాయాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తారు. ఇక జగన్‌ను ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోండి.. అందుకు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ... మాటాడితే "బటన్ నొక్కాను.. బటన్ నొక్కాను! అని అంటూ ఉంటాడు. రాజకీయం అంటే బటన్ నొక్కడమేనా? అభివృద్ధి అంటే బటన్ నొక్కడమేనా? ఈ బటన్‌రెడ్డి పదేపదే అదే మనకి చెబుతున్నాడు. క్లాస్ వార్ అంటున్నాడు! ఏది క్లాస్ వార్? ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చింది పది రూపాయలు... లాగేసింది రూ. వంద రూపాయిలు. అదేవిధంగా మీకు వంద ఇచ్చి రూ. వెయ్యి నొక్కేశాడు.. ఈ విషయం ఎవరికైనా అర్ధం అయిందా?" అని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు.