ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. దేశం మొత్తం చూపు ఈ ఎన్నికల పైనే పడింది. మొత్తం 175 నియోజకవర్గాలు,25 పార్లమెంటు స్థానాలలో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్ది రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎలక్షన్స్ కు ఇంకా 14 రోజుల టైం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికి నచ్చిన  వాగ్దానాలు వారు ఇస్తున్నారు. ఇదే తరుణంలో జగన్ నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కానీ ఈ మేనిఫెస్టోలో అంతగా కొత్తదనం ఏమీ లేదు. 

పాత పథకాలనే కొనసాగింపుగా చేస్తూ బూస్టింగ్ ఇచ్చే విధంగా పెంపు చేశారు. అంతేకాకుండా పాత మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ అనే పాయింట్ ఉండేది దానికి బదులుగా ఇప్పుడు కంపెనీలను తీసుకువచ్చి జాబ్స్ ఇస్తారట. అంతే కాకుండా పోయినసారీ మద్యం నీషేధం ఉంది. ఈసారి మద్యం నిషేధం చేద్దామనే పదాన్ని తీసేశారు.  సూపర్ సిక్స్ మేనిఫెస్టోకు ఈ మేనిఫెస్టో ధీటుగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. ఇదే తరుణంలో కూటమి మేనిఫెస్టో కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ కి పవన్ డెడ్ లైన్ పెట్టారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

ఇదే తరుణంలో జగన్ మేనిఫెస్టోలో ఏమీ లేదని ,ఈనెల 30వ తేదీన మా మేనిఫెస్టో వస్తుంది చూడండి అంటూ పవన్ జగన్ కు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఈ మేనిఫెస్టో బంపర్ హిట్ అవుతుంది.  ఇది రిలీజ్ అయిన తర్వాత రాష్ట్రంలో పూర్తిగా ప్రజల్లో మార్పు వస్తుందని వెయిట్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. మా మేనిఫెస్టో ద్వారా  కూటమి బలం ఏంటో చూపిస్తామని పవన్ అంటున్నారు. దీంతో కూటమి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందని ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఒకవేళ కూటమి మేనిఫెస్టో  వైసిపి మేనిఫెస్టో కంటే బాగుంటే మాత్రం  దాదాపుగా ఈ ఓట్లు టిడిపి కూటమి వైపు మళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: