
అయితే గాజు గ్లాస్ సింబల్ ను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం ద్వారా మరీ తీవ్రస్థాయిలో నష్టం కలుగుతుందని భావించడం మూర్ఖత్వం అవుతుంది. నిజానికి ఓటర్లకు అభ్యర్థి ఎవరు? పార్టీ గుర్తు ఏది? ఎవరికి ఓటు వేయాలి? అనే అంశాలకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఉంది. జనసేన పార్టీ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో ఎక్కడ పోటీ చేయట్లేదో ఓటర్లకు దాదాపుగా అవగాహన ఉంది.
గడిచిన 25 సంవత్సరాలలో ప్రజలకు అన్ని అంశాల గురించి అవగాహన పెరిగింది. కూటమి మరీ కంగారు పడుతున్న స్థాయిలో వాస్తవ పరిస్థితులు ఉండవు. గాజు గ్లాస్ గుర్తు గుర్తించి ఏ మాత్రం టెన్షన్ పడకుండా కూటమి అభ్యర్థులు ప్రచారం చేసుకుంటే మంచిది. అతిగా టెన్షన్ పడితే కూటమికే తీవ్రస్థాయిలో నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఎంతో అనుభవం ఉన్న బాబు ఇలాంటి చిన్నచిన్న విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే కోర్టును ఆశ్రయిస్తే మంచిది. ఒకసారి గుర్తును కేటాయించిన తర్వాత ఆ గుర్తును మార్చడం జరిగే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 6 శాతం ఓటింగ్ సాధించగా ఈ ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.