ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా చూసుకుంటే అగ్రవర్ణాలు అయినటువంటి కాపు, ఆర్యవైశ్య, క్షత్రియ వర్గాలపైన వరాలు జల్లు కురిపించారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీల పింఛన్లు, మహిళలకు పథకాలపై ఎక్కవ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ బాబు సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. వీటితో పాటుగా మెగా డీఎస్సీపై మొదటి సంతకం, సామాజిక పింఛను రూ.4 వేలకు పెంచడం, వికలాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు, బీసీలకు 50 ఏళ్లకే పింఛను , ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు, యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి హామీలను ప్రకటించిన సంగతి విదితమే.
వాటితో పాటు సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతి కోసం మరిన్ని కొత్త పథకాలను ఎన్డీఏ కూటమి ఈ సందర్భంగా ప్రకటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. నాయీ బ్రాహ్మణులకు 25 వేల రూపాయిలు, స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పోరేషన్, బీసీలకు 50 ఏళ్లకే పింఛను, వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు, ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నాయీ బ్రాహ్మాణుల షాపులకు 200 యూనిట్ల వరకు ఉచితం, మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్థిక సాయం.. 217 జీవో రద్దుకు హామీ.. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం, డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.