బీసీ డిక్లరేషన్..
•బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు రూ .4000 పెన్షన్
•బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
•బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్ల ఖర్చు
* స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్
•చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాము..
•తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్ణాలకు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు
•అలాగే స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10వేల కోట్ల వ్యయం
యాదవ/ కురబ..
యాదవ /కురబ సామాజిక వర్గానికి అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం, యూనిట్ల స్థాపనకు రాయితీలు అలాగే గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లకు బీమా సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు.
నాయీ బ్రాహ్మణులు:
నాయి బ్రాహ్మణుల కోసం దేవాలయాల్లో పనిచేసే వారికి రూ.25వేల గౌరవ వేతనం అందిస్తారట. అలాగే షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు..
ముస్లిం మైనారిటీల సంక్షేమం..
50 ఏళ్లకే పెన్షన్, మసీదులు ఏర్పాటు చేయడానికి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.. అలాగే నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా రూ.100కోట్లు కేటాయిస్తామని.. మైనారిటీ ఫైనాన్షియన్ కార్పొరేషన్ ద్వారా రూ .5లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని స్పష్టం చేశారు.. ఇమామ్ , ఖాజీ లకు ప్రతి నెల రూ .10,000 అలాగే రూ.5000 గౌరవ వేతనం, ప్రభుత్వ ఖాజీలకు ఇమామ్లతో సమానంగా గౌరవ వేతనం అందిస్తామని తెలిపారు. అర్హత ఉన్న ఇమామ్ లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తామని మసీదుల నిర్వహణకు ప్రతినెల రూ.5 వేలఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.. అంతేకాదు హాజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లిం కి లక్ష రూపాయల సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
క్రిస్టియన్ల సంక్షేమం..
క్రిస్టియన్ మిషనరీ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఏర్పాటు చేస్తామని.. చర్చిల నిర్మాణం పునరుద్ధరణకు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. అలాగే స్మశాన వాటిక లకు స్థలాన్ని కేటాయిస్తామని కూడా తెలిపారు.. వీటితోపాటు జెరూసలేం యాత్రికులకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని స్పష్టం చేశారు.