
ఈ క్రమంలోనే ప్రధాన పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు పర్వం కూడా తారాస్థాయికి చేరుకుంది. అయితే గత కొంతకాలం నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా రేవంత్ రెడ్డి సీఎం సీటును సైతం వదిలేసి బిజెపిలో చేరబోతున్నాడు అంటూ కేటీఆర్, హరీష్ రావులు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో జరగబోయేది ఇదే అంటూ చెబుతున్నారు. అయితే సీఎం సీటు వదిలి రేవంత్ ఎందుకు బిజెపిలోకి వెళ్తారు అని చర్చ మొదలైంది.
కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి మాత్రమే బిఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ ప్రజలు అనుకుంటుండగా.. ఇటీవల నిజాంబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బిజెపిని ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్కు లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీని ఖాళీ చేసి బిజెపిలోకి వస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. కెసిఆర్ ఎంతో కొంత బీజేపీని కంట్రోల్ చేయగలిగారని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న లీటర్లలో ఎవరికి అంత సామర్ధ్యం లేదు అంటూ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. అయితే ఇలా తెలంగాణ బిజెపి కీలక నేత అరవింద్ సైతం రేవంత్ కమలం పార్టీలోకి వస్తున్నాడు అంటూ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో రేవంత్ బిజెపిలో చేరిక నిజమే అయ్యుంటుంది అని అందరూ చర్చించుకుంటున్నారు.