చంద్రబాబు మేనిఫెస్టో అస్సలు నమ్మే విధంగా లేదని ఓటర్లు చెబుతుండటం గమనార్హం. ఈ మేనిఫెస్టోతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని సొంత మేనిఫెస్టోను మాత్రమే తమ పార్టీ అమలు చేస్తుందని బీజేపీ జాతీయ నాయకత్వం చెబుతోంది. అలివి కాని హామీలతో చంద్రబాబు, జగన్ ఏపీ ఓటర్లను ముంచేయడానికి సిద్ధమయ్యారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మేనిఫెస్టో అమలు విషయంలో మంచి జరిగినా చెడు జరిగినా టీడీపీ, జనసేన పార్టీలదే బాధ్యత అని తమకు ఏ మాత్రం సంబంధం లేదని బీజేపీ చెబుతుండటం గమనార్హం. బీజేపీ రాష్ట్ర సహ ఇంఛార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ మేనిఫెస్టో ప్రతిని టచ్ చేయడానికి సైతం ఇష్టపడలేదంటే వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో సులువుగా అర్థమవుతున్నాయి. బాబు హామీలు ఆచరణ సాధ్యం కాని హామీలు అని బీజేపీకి పూర్తిస్థాయిలో క్లారిటీ ఉంది.
ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బీజేపీ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడలేదు. పవన్ కళ్యాణ్ తప్ప బాబోరిని ఎవరూ నమ్మట్లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి మేనిఫెస్టో వల్ల టీడీపీ, జనసేనలకు మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో తెలియాలంటే ఎన్నికలు జరిగే వరకు ఆగాల్సిందే. కూటమి నేతలు రుణమాఫీ హామీని కూడా ప్రకటించి ఉంటే బాగుండేదని కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్రజలు కూటమి మేనిఫెస్టోను నమ్మకపోతే 2019 ఎన్నికల ఫలితాల కంటే దారుణమైన ఫలితాలు రావడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.