ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నవరత్నాలు సంక్షేమ పథకాలు మహిళలకు చాలా ప్రయోజనాలను సేకరిస్తున్నాయి. వీటిలో కాపు నేస్తం ఓబీసీ నేస్తం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పేర్లతో మహిళలకు ఆర్థిక సహాయం చేస్తూ పోతున్నారు. అలాగే రుణమాఫీ పేరుతో ఐదేళ్లుగా డబ్బులు మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఈసారి అధికారంలోకి వస్తే మూడు లక్షల వరకు సున్నా వడ్డీతో రుణాలను అందిస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇస్తున్న చేయూతను 18 నెలల వరకు కొనసాగించనున్నారు. మూడు లక్షలు, రెండు లక్షలు తీసుకున్న వారి రుణాలు కూడా జగన్ మోహన్ రెడ్డి మాఫీ చేశారు. దీనివల్ల రూ.20వేల కోట్ల దాకా ప్రభుత్వం పై భారం పడింది. అయితే చంద్రబాబు అధికారంలోకి వస్తే వీటిని రద్దు చేసే లాగా ఉన్నారు.

స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నామని చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టారు. ఒక సంఘానికి ఆయన 10 లక్షలు మాత్రమే ఇస్తారు అంటే ఒక్కొక్కరికి లక్ష రూపాయల రుణం మాత్రమే అందుతుంది. అదే జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రకారమైతే పదిమందికి 30 లక్షలు అందుతాయి. ప్రత్యేక పథకం కింద B4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యూటీ చెల్లిస్తామని కూడా ప్రామిస్ చేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచుతామని కూడా తెలిపారు.

ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్స్ లో వసతి కూడా ఫ్రీగా కల్పిస్తామని అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. విద్యార్థులకు కలలకు రెక్కలు ద్వారా లోన్స్ కూడా అందిస్తామని పేర్కొన్నారు. పండగలకు శుభకార్యాలకు కానుకలను కూడా అందజేస్తామని బాబు సంచలన ప్రకటన చేశారు. అయితే చేయూత, బీసీ నేస్తం, కాపు నేస్తం వంటి పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన ఇచ్చిన హామీల ప్రకారం స్పష్టంగా అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

YCP