
అమెథి పార్లమెంటు స్థానం అటు కాంగ్రెస్ కి కంచుకోట అక్కడి నుంచి ఎవరు పోటీ చేసిన భారీ మెజారిటీతో విజయం సాధిస్తారు. కానీ గత ఎన్నికల్లో రాహుల్ ఇక్కడి నుంచి ఓడిపోయారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేస్తూ వస్తున్నారు అన్న విషయం తెలిసిందే కానీ ఈసారి ఎవరు ఇక్కడి నుంచి పోటీకి దిగుతారు అనే విషయంపై ఒక స్పష్టత లేకుండా పోయింది. ఇప్పటికే బీజేపీ నుండి స్మృతి ఇరానీ ఇక్కడ పోటీకి దిగి నామినేషన్ కూడా దాఖలు చేశారు. కానీ ఇంకా కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని తేల్చలేదు. ఇక ఎవరు పోటీ చేస్తారు అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది అని చెప్పాలి.
రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ లను బరిలో నిలపాలి అంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆమెథిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోయేది ఎవరో వెంటనే తేల్చాలి అంటూ ఆ పార్టీ నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం సంచలనంగా మారిపోయింది. గత ఎన్నికల్లో అమేథి నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాహుల్ గాంధీ ఇక ఇప్పుడు అదే స్థానం నుంచి విజయం సాధించి గౌరవాన్ని నిలుపుకోవాలి అంటూ ఎంతో మంది కార్యకర్తలు కోరుతున్నారు. అయితే ఇక్కడ మే 20వ తేదీన పోలింగ్ జరగబోతుంది అని చెప్పాలి.