పేరుకే నీతులు... జీరో పాలిటిక్స్ అని గప్పాలు కొడుతున్నారని, తనని ఎదగనివ్వకుండా చేయడం అనే అంశాన్ని పక్కన పెడితే పార్టీ వాళ్ళతో అయితే తను ప్రతి నిమిషం యుద్ధం చేశానని ఈ సందర్భంగా కన్నీటి పర్యంతం కావడం గమనార్హం. తన భర్త పవన్ నామకరణం చేసేవారని, పవన్ కోసం సొంత ఊరు వెళ్దామంటే రావడానికి ఒప్పుకున్నానని అన్నారు. అమెరికాలో 1000000 జీతం వదులుకుని మరీ ఇంత దూరం వస్తే ఇక్కడ మాకు మొండి చేయే మిగిలింది అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించే వ్యక్తులు ఈ జనసేన పార్టీలో అస్సలు లేరని ఆమె ఈ సందర్భంగా అభిప్రాయ పడ్డారు. జనసేన పార్టీలో ఉన్న వ్యక్తులకి చిల్లర మనస్తత్వం అని.. అందరూ అజమాయిషీ చేసేవాళ్ళేనని అన్నారు.
ఇక తానొక దళిత మహిళని కావడంతో జనసేన పార్టీ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అవమానం జరిగిందని... ఎమ్మెల్యే సీటు కోసం ఏకంగా నన్ను 10 కోట్లు అడిగారని వాపోయారు. అయితే పది కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డామని.. అందుకోసం యూఎస్ లో ఇల్లు సైతం అమ్మేశామని అన్నారు. ఇల్లు అమ్మగా 6 కోట్లు రాగా, తన అత్తయ్య గారి దగ్గర 2 కోట్లు, మిగతా 2 కోట్లు ఫైనాన్షియర్ దగ్గర అప్పు తీసుకున్నామని అన్నారు. అదే విధంగా పార్టీకి డొనేషన్ అడిగితే.. 10 వేలు, ఆ తర్వాత పార్టీ అన్నాక ఖర్చులు ఉంటాయి, లెక్కలు ఉంటాయని డబ్బులు అడిగితే 2 లక్షలు, మొత్తానికి 2 కోట్లు లేనిదే పనవ్వదమ్మా? అని పార్టీ నేతలు అంటే విస్తుపోయామని... పవన్ కళ్యాణ్ ఏమో జీరో పాలిటిక్స్ అని కామెడీ చేస్తారని సుభాషిణి కన్నీటి పర్యంతమయ్యారు.