గత ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ "నవరత్నాల" పేరిట ప్రజలకు సంక్షేమ పథకాలు అందించగా ఈ సారి అంతకు మించి సంక్షేమం ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడ జరిగిందేమిటంటే గత 5 సంవత్సరాలుగా అమలు చేస్తోన్న నవరత్నాలను మరింత మెరుగ్గా అమలు చేసి చూపిస్తామని జగన్ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. అవును, గత మ్యానిఫెస్టోకే కొద్దిపాటి కేటాయింపులు పెంచి.. చిన్న చిన్న మార్పులతో కొత్త మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఈ క్రమంలోనే వాస్తవానికి మ్యానిఫెస్టో ప్రకటనకు ముందు వైసీపీ గ్రాఫ్ ఒకలా ఉంది. కానీ ప్రకటించాక మరోలా ఉందనే మాట వినిపిస్తోందిపుడు.
అవును, టీడీపీ మ్యానిఫెస్టో కూడా వైస్సార్సీపీ మేనిఫెస్టోని పోలి ఉండడం వైసీపీకి కలిసి వచ్చే అంశమని రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు. బీజేపీ సైతం ఈ ఉమ్మడి మ్యానిఫెస్టోకు దూరంగా ఉండటం కూటమికి బీటలు వారే అవకాశం లేకపోలేదు. మ్యానిఫెస్టో ప్రకటన తర్వాత జగన్ గ్రాఫ్ కొంత తగ్గిందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నప్పటికి.. పథకాలన్నింటికి కూడా వ్యయాన్ని పెంచడం అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా రాజకీయ అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు జగన్ అమలు అయ్యే హామీలు మాత్రమే ఇచ్చారని.. చేయలేని హామీలను జగన్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చలేదని ఆ పార్టీ నేతలు చెబుతుండడం గమనార్హం. రాష్ట్ర బడ్జెట్‌ను బట్టే జగన్ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు.