ఆంధ్రాలోని రాజకీయాలు చాలా హాట్ టాపిక్ గా మారాయి.. ముఖ్యంగా సీఎం జగన్ ఆయన సోదరి షర్మిల ఇద్దరీ మధ్య ఎన్నికలు పోరా హోరిగా సాగుతున్నాయి. ముఖ్యంగా షర్మిల ఆంధ్ర ప్రదేశ్ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టింది. అప్పటినుంచి వైసిపి ప్రభుత్వం పైన వ్యతిరేకంగానే మాట్లాడుతోంది షర్మిల. ఇప్పుడు తాజాగా ఆమె నవరత్నాలు సరే ఈ నవ సందేహాలకు సమాధానం చెప్పాలి కదా అన్నయ్య అంటూ వ్యాఖ్యానిస్తోంది షర్మిల. వాటి గురించి పూర్తిగా ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.



షర్మిల ఇప్పుడు ఈ విషయాలను కార్నర్ చేస్తూ నవ సందేహాల పేరుతో ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయాలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ కూడా తనకు ఉందంటూ తెలియజేసింది. నవసందేహాలు తీసుకురావడం సమాధానాలను కోరడం రాజకీయంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. చాలా వ్యూహాత్మకంగానే షర్మిల రాజకీయాలలో అడుగులు వేస్తూ ముందుకు వెళుతోందని పలువురు కాంగ్రెస్ నేతలు కూడా తెలియజేస్తున్నారు. షర్మిల ఇచ్చినటువంటి నవ సందేహాల విషయానికి వస్తే..


1). ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించడం నిజము కాదా ..?

2). ఎస్సీ ఎస్టీలలో వెనుకబడిన వారికి పునరావాసాలను ఎందుకు ఆపేశారు..

3). గత ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ ఎస్టీలకు 28 పథకాలు ఎందుకు ఆగిపోయాయి.


4). ఎస్సీ ఎస్టీ రైతులకు వైయస్ హయాంలో సాగు భూములు ఇచ్చారు వాటిని ఎందుకు ఆపేశారు..


5). వైసీపీలో ఎస్సీ ఎస్టీ స్థానాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అంటూ..


6). అంబేద్కర్ విదేశీ విద్య దీవెన పథకంలో అంబేద్కర్ పేరు ఎందుకు తొలగించారు.


7). అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ కు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు.

8). సొంతంగా డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన అనంత బాబుకు ఎందుకు వెనకేసుకున్నారు.


9). రైతులకు సాగుభూములు పంచే కార్యక్రమాన్ని ఎందుకు ఆపివేశారు.


ఇలా నవ సందేహాలను షర్మిల లెటర్ ద్వారా తెలియజేస్తూ విడుదల చేసింది. మరి వీటి పైన వైసిపి పార్టీ నేతలు జగన్ ఎలా సమాధానం చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: