•కూటమిలో కుమ్ములాటలు
•రాష్ట్ర సమస్యలు కంటే కూటమి సమస్యలు ఎక్కువయ్యాయి
•విశాఖలో జనసైనిక్స్ కి ఘోర అవమానం

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కూటమిలో రచ్చ మొదలైంది. ఎవరికి వారే ఆధిపత్యం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఏకంగా ప్రచార సమయంలోనే వీరి మధ్య గొడవనేది బయట పడిపోతోంది.ప్రస్తుతం కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి. టీడీపీలోనే వర్గపోరు కొనసాగుతుంటే, అటు తెలుగుదేశం, బీజేపీ ఇంకా జనసేన మధ్య కూడా ఆధిపత్యపోరు ఎక్కువ నడుస్తోంది. కొన్నిచోట్ల జనసేన ప్రచారానికి రావొద్దంటూ టీడీపీ తమ్ముళ్లు అయితే హుకుం జారీ చేస్తున్నారు.నంద్యాల జిల్లాలో కోట్ల వర్గం, ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం మధ్య నువ్వా..నేనా? అనే రీతిలో ఆధిపత్య పోరు తీవ్రంగా నడుస్తోంది. ప్యాపిలి మండలం పెద్ద పూజర్లలో ఏకంగా రాళ్లతో దాడి చేసుకునే దాకా వెళ్లింది వ్యవహారం. ప్రసాద్ వర్గం, తప్పెల శీను వర్గాలుగా విడిపోయి కట్టెలతో రాళ్లతో ఎంతగానో దాడి చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి మా వర్గం ముందు దండ వెయ్యాలి అంటే, మా వర్గం ముందు దండ వేయాలని ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. అసలు ఎంత సముదాయించినా కూడా ఎవరూ వినకపోవడంతో దీన్ని తట్టుకోలేక కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి కారు ఎక్కి అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.ఇదిలా ఉంటే విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ నేతలకు ఘోర అవమానం ఎదురైంది.



టీడీపీ ప్రచార రథంపై నుంచి జనసేన పార్టీ నేతలను బలవంతంగా గెంటేశారు. గల్లాలు పట్టి కిందకు లాగేశారు తెలుగుదేశం పార్టీ నేతలు. టీడీపీ ప్రచార రథంపై జనసేన జెండాలు లేకుండా ప్రచారం చేయడాన్ని జనసేన పార్టీ శ్రేణులు ప్రశ్నించడం జరిగింది. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు, జనసేన నేతలను, ఆపార్టీ జెండాలు పట్టుకుని ప్రచార రథం ఎక్కిన వారిని బలవంతంగా దించడం జరిగింది. ప్రచార రథం దిగిపోవాలని వారు హెచ్చరించారు.దెందులూరు మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున బరిలో నిలిచిన చింతమనేని ప్రభాకర్‌ కూడా జనసేన పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. తమతో కలిసి ప్రచారానికి వస్తే రండి..లేదంటే వద్దు అని వారు కామెంట్‌ చేశారు. దీంతో అటు పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న వేళ కూటమిలో కుమ్ములాటలు మూడు పార్టీల అగ్రనేతలకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. రాష్ట్రంలో ఉన్న సమస్యలు కంటే ఈ కూటమిలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: