మరికొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ పార్టీ చాలా స్థానాల్లో మహిళ అభ్యర్థులకు అవకాశాన్ని కల్పించింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా... దర్శి నియోజకవర్గం నుండి గొట్టిపాటి లక్ష్మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటును దక్కించుకోగా... నెల్లూరు జిల్లా , కోవూరు అసెంబ్లీ స్థానం నుండి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటును దక్కించుకుంది. ఇక దర్శి నియోజకవర్గం విషయానికి వచ్చినట్లు అయితే ఇక్కడ వైసీపీ పార్టీ నుండి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సీటును దక్కించుకున్నారు.

ఇక ఈ ప్రాంతం నుండి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి , గొట్టిపాక లక్ష్మికి ఇద్దరికీ సీటు ఖరారు అయ్యి చాలా కాలం అవుతుంది. వీరికి సీటు ఖరారు అయ్యే చాలా కాలం అవుతుండడంతో వీరిద్దరు కూడా ప్రాంతీయంగా అనేక ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకపోతే గొట్టిపాటి లక్ష్మీ ప్రాంతీయంగా ప్రసూతి వైద్యరాలుగా పనిచేస్తుంది.  ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎంతో మంది గర్భిణీ స్త్రీ లకు వైద్య సేవలను అందించడంతో ఈమెకు ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. ఇక ఇక్కడ పోయినసారి వైసీపీ కాంగ్రెస్ పార్టీ నుండి మద్దిశెట్టి వేణుగోపాల్ గెలుపొందారు.

ఈసారి ఈయనకు కాకుండా శివప్రసాద్ రెడ్డికి సీటు ఇవ్వడంతో ఇక్కడి వైసీపీ రాజకీయ పరిణామాలు మారాయి. ఇక ప్రస్తుతం దర్శి నుండి పోటీలో ఉన్న శివప్రసాద్ రెడ్డి , గొట్టిపాటి లక్ష్మి ఇద్దరు కూడా కొత్త వాళ్లే అయినప్పటికీ స్థానికంగా గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కావడంతో ఈమెకు కాస్త ఎడ్జ్ కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కోవూరు నియోజకవర్గం విషయానికి వచ్చినట్లు అయితే ఇక్కడ టీడీపీ పార్టీ నుండి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పోటీ చేస్తూ ఉండగా ... వైసీపీ పార్టీ నుండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీలోకి దిగబోతున్నారు.

ఇకపోతే 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అందులో గెలుపొందాడు. ఇక ఈయన ప్రస్తుతం ఆ ప్రాంతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఈయనకు ఇక్కడ క్యాడర్ భారీగా ఉంది. మరి ఇప్పటికే ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్నకుమార్ రెడ్డి వైపు ఈ ప్రాంత ప్రజలు నిలబడతారా..? లేక ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి ప్రశాంతి రెడ్డి వైపు నిలబడతారా అనేది కాస్త ఆసక్తిగా మారింది. ఏదేమైనప్పటికీ టీడీపీ పార్టీ నుండి బరిలోకి దిగిన ఈ ఇద్దరు మహిళలకు గెలుపు అవకాశాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి అని ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: