సాధారణంగా ఎన్నికలలో నిలుచున్నవారు. తమకు తాము కంపల్సరిగా ఓటు వేసుకుంటారు కానీ గత ఎంపీ ఎన్నికలలో లోక్ సభ అభ్యర్థులుగా నిలబడిన వారు తమకు తామే ఓటు వేసుకోలేకపోయారు. ఈ వింత అనుభవం వారికి ఎదురు కావడం నిజంగా హాస్యాస్పదమని చెప్పుకోవచ్చు. ఈసారి కూడా కొంతమంది విషయంలో ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే వీరు నిలుచున్న చోట వీరికి ఓటు హక్కు లేదు.

ఈ నాయకుల ఓటు హక్కు ఇతర నియోజకవర్గాల్లో ఉన్నది. అందువల్ల వారు వేరేచోట వేరే వారికి ఓటు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. కుటుంబ సభ్యులు కూడా నివాసాలు వేరే ప్రాంతంలో ఉండటం వల్ల తమ వారికి ఓటు వేయలేరు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేవెళ్లలోని రాజేంద్రనగర్ పరిధిలో ఉంటుంది. ఇక్కడ ఎంఐఎం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు కాబట్టి ఏం వారందరూ ఇతరులకు ఓటు వేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.

హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్ర హిల్స్ లో ఉంటుంది. అయితే ఆమె ఓటు మాత్రం కంటోన్మెంట్ అసెంబ్లీ ఓటరు జాబితాలో ఉంది. ఈ ప్రాంతం మల్కాజ్‌గిరి లోక్‌సభలోకి వస్తుందని స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. దీని ఫలితంగా ఆమె తనకు ఓటు వేసుకోలేని పరిస్థితి వచ్చింది. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత పరిస్థితి కూడా ఇలాగే తయారయింది. ఆమెకు తాండూరు అసెంబ్లీ పరిధిలో ఓటు హక్కు ఉంది. ఈ కారణంగా సునీత మహేంద్రారెడ్డి వేరే వారికి ఓటు వేయాల్సి వస్తోంది.

హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సమీర్ కూడా వేరే చోట ఓటు హక్కు కలిగి ఉన్నాడు. అందువల్ల ఆయన కూడా తనకు తాను ఓటు వేసుకోలేకపోతున్నాడు. ఇలా తెలంగాణలో ఎంపీలకు వింత పరిస్థితి ఎదురవుతోంది. మరి వీరు భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి నెలకొనకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: