వైసీపీ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం జనసేన పార్టీని బాగా టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. అయితే ఆయన చేసిన కామెంట్స్ వారి ఇంట్లోనే రాజకీయ కల్లోలాన్ని సృష్టించాయి. ఆయ‌న కుమార్తె క్రాంతి భార‌తి ముద్రగడ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. పద్మనాభం పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు వద్దకు కూడా పంపించనని, అతడి ఓటమిని తాను శాసిస్తానంటూ ముద్రగడ షాకింగ్ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని పిఠాపురం వ్యవహారంలో క్రాంతి భార‌తి జోక్యం చేసుకున్నారు.

దానికంటే ముందు ముద్రగడ పవన్‌కళ్యాణ్‌ని ఓడించకపోతే ఏకంగా త‌న పేరు మార్చుకుంటాన‌ని శపథం చేశారు. పవన్‌పై ఈ రేంజ్‌లో రెచ్చిపోతున్న ముద్రగడకు క్రాంతి భార‌తి ఒక పెద్ద షాకిచ్చారు. పవన్‌కు సపోర్ట్‌గా మాట్లాడుతూ ఆమె తన సొంత తండ్రినే విమర్శించారు. ముద్ర‌గ‌డను జ‌గ‌న్‌ బాగా ఉపయోగించుకుంటున్నారని.. త‌న తండ్రి ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని ఒక వీడియో ద్వారా కామెంట్స్ చేసింది.

పేరు మార్చుకుంటానని తన తండ్రి ఎందుకు అంటున్నారో, అసలు కాన్సెప్ట్‌కి ఏం అర్థం ఉందో తనకు తెలియడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చేయడమే కాకుండా తాను ప‌వ‌న్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. పవన్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేయడానికి కూడా తాను ఆలోచిస్తున్నట్లు చెప్పారు. కూతురు ఇచ్చిన షాక్‌కి ముద్రగ‌డ కొంత సమయం దాకా సైలెంట్ అయిపోయారు.

మళ్లీ ఏమనుకున్నారో ఏమోగానీ కుమార్తె భార‌తికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. "భార‌తి నా కన్న కూతురు. ఒక‌ప్పుడు నా ఆస్తి.. కానీ, ఇప్పుడు కాదు. అందుకే ఆమె నా గురించి ఏం మాట్లాడినా అసలు పట్టించుకోను. భార‌తి ఇప్పుడు అత్తగారి ఇంటి ఆస్తి అయిపోయింది. ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తానంటే నేను వెల్కం చెప్తా. కానీ ఆమెను ఒక ప్ర‌త్య‌ర్థిగానే చూస్తా." అని ముద్రగడ అనూహ్య కామెంట్స్ చేశారు. భార‌తి వెనుక‌ ఉండి ఆమె చేత ఈ మాటలు మాట్లాడిపిస్తున్నారని, ఇదంతా తనకు ఒక కుట్ర లాగా అనిపిస్తుందని, నేరుగా తనని దెబ్బతీయలేక కుమార్తెను వాడుకుంటున్నారని కూడా ముద్రగ‌డ ఆరోపించారు.వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు ఈ పనులన్నీ చేస్తున్నారని ఆయన అలిగేషన్స్ చేశారు. ఇలాంటి పిల్లకాకులను తాను ఎంతోమందిని చూశానని, ఎవరూ తనని ఏమీ చేయలేరని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: