2024 ఎన్నికల్లో కూటమి గెలవకపోతే టీడీపీ ఎప్పటికీ అధికారంలోకి రాదేమో అనే భయం చంద్రబాబులో ఉంది. లోకేశ్ ను ఏపీ ప్రజలు సీఎంగా అంగీకరించే అవకాశాలు లేవని టీడీపీ నేతలు భావిస్తారు. అందువల్ల ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బాబు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరోసారి మాయ చేసి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బాబు ప్రయత్నిస్తున్నారని ఆయన మేనిఫెస్టో చూస్తే అర్థమవుతోంది.
 
మరోవైపు ఆయన అనుకూల పచ్చ పత్రికలు, టీవీ ఛానెళ్లు బాబు సీఎం అయితే ప్రజలు లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతారనే విధంగా అరచేతిలో వైకుంఠం చూపిస్తూ మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల్లో వైసీపీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత లేకపోయినా చంద్రబాబు అనుకూల మీడియా ద్వారా జగన్ సర్కార్ పై అబద్ధపు ఆరోపణలతో నీలాపనిందలు వేస్తున్నాయి.
 
గతంలో ఏం చేసి అధికారంలోకి వచ్చారో మళ్లీ అదే మార్గాన్ని బాబు అనుసరిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ గ్రాఫ్ పొత్తు తర్వాత డౌన్ అయిందని చాలా జిల్లాల్లో కూటమికి అనుకూల పరిస్థితులు లేవని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అనుకూల వ్యక్తులతో జగన్ పాలనపై కృత్తిమంగా వ్యతిరేకత సృష్టించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. బాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది నిజమో ఏది మోసమో తెలుసుకోలేని స్థితిలో ప్రజలు లేరు.
 
చంద్రబాబు గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పు లేదని అయితే వైసీపీ గురించి దుష్ప్రచారం చేస్తూ గెలుపు కోసం ప్రయత్నించడం మాత్రం ముమ్మాటికీ తప్పేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2019లో టీడీపీ దారుణ ప్రచారానికి పచ్చ మీడియా ఒక విధంగా కారణమని చాలామంది భావిస్తారు. చంద్రబాబు వాస్తవాలను మరిచి మరోసారి మాయా ప్రపంచాన్ని నమ్మితే మాత్రం ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. బాబు ఓటర్లను తక్కువగా అంచనా వేస్తే నష్టపోతారని విశ్లేషకులు చెబుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: