- పరుచూరు బోర్డర్ తెలియని బాలాజీకి వైసీపీలోనే నిరాదరణ
- బాపట్ల పార్లమెంటు భారీ మెజార్టీలో కీలకం కానున్న ' ఏలూరి ' కష్టం..!
- పక్కా ప్లానింగ్ ఆరు మండలాల్లో పోలింగ్‌కు ముందే వైసీపీని వాష్‌వుట్ చేసిన సాంబ
( ప్రకాశం - ఇండియా హెరాల్డ్ )
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పరుచూరు. ఇక్కడ నుంచి ఎడం బాలాజీ వైసీపీ నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. అయితే.. ఎన్నికలకు ఎనిమిది రోజులు మాత్ర మే గడువు ఉన్న నేపథ్యంలో నాయకులు.. పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇక్కడ ఏలూరి దూకుడు ముందు ఎడం పూర్తిగా వెనుకబడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే వైసీపీ అధిష్టానం సైతం ఈ నియోజకవర్గంపై ఇప్పటికే ఆశలు వదిలేసుకుందనే చర్చ సొంత పార్టీ నేతల్లోనే నడుస్తోంది.
ఏలూరి విషయాన్ని చూసుకుంటే.. ఆయన గ్రామీణ ప్రాంతాల్లో అడుగు పెట్టగానే.. స్థానికులే ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతులు.. స్వచ్ఛందంగా ప్రచారానికి తరలి వస్తున్నారు. కాపు, రెడ్డి, బలిజ, యాదవ, ఇతర బీసీలతో పాటు వైసీపీకి సంప్రదాయంగా మెజార్టీ ఓటు బ్యాంకుగా చెప్పుకునే ఎస్సీ, ఎస్టీల్లోనూ మూడొంతులకు పైగా ఈ సారి ఏలూరికే మా ఓటు అని ఓపెన్‌గా చెప్పేయడంతో పాటు పార్టీ కండువాలు కప్పేసుకుంటున్నారు.
ఇంకా చెప్పాలంటే ఆరు నెలల క్రితమే పరుచూరులో ఏలూరి గెలుపు కన్‌ఫార్మ్ అయ్యింది. ఆరు నెలల నుంచి ఈ రోజు వరకు పరుచూరులో టీడీపీలో చేరికల జోరు ఆగడం లేదు. వందలు వందలుగా.. అన్ని గ్రామాల్లోనూ టీడీపీలో ఫుల్ చేరికల జోష్ కనిపిస్తోంది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఐదు మండలాలు టీడీపీకి వన్‌సైడ్ మెజార్టీతో కనిపిస్తున్నాయి. చినగంజాం మండలం కూడా ఇప్పుడు అదే బాటలో ఉంది. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే.. పరుచూరు పరిధిలోని పది గ్రామాల్లో (పరుచూరు, ఉప్పుటూరు, వీరన్నపాలెం, నాగుల పాలెం, అడుసుమల్లి, పోతుకుట్ల తదితర ) టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా తీర్మానాలు చేయడం గమనార్హం.
నియోజకవర్గంలో ఆరు మండలాల్లో యద్దనపూడి, పరుచూరు మండలాలు.. ఆది నుంచి కూడా.. ఏలూరికి సానుకూలంగా ఉన్నాయి. ఇక, కారంచేడులో మాజీ ఎమ్మెల్యే.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఒకప్పుడు అనుకూలంగా ఉండేది. కానీ, ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నాక.. ఇక్కడ కూడా ఏలూరి వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. కారంచేడులో కాపులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మండల పార్టీ ప్రెసిడెంట్ అదే వర్గానికి చెందిన నేతకు ఇచ్చారు. కాపు వర్గానికి ఏలూరికి ముందు నుంచి సన్నిహిత సంబంధమే ఉంది. అందుకే బాలాజీ అదే వర్గానికి చెందిన నేత అయినా ఆయన నాన్ లోకల్ కావడం.. అసలు తమ కులంతోనే ఆయనకు సరైన అప్రోచ్ లేకపోవడంతో ఆయన వైపు వెళ్లేందుకు ఎవ్వరూ ఇష్టపడడం లేదు.
బాలాజీ ఒకరిద్దరు నేతల దగ్గర కాపు కులం కార్డు బయటకు తీసి మనం మనం ఒక్కటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా.. నువ్వు ఎప్పుడో పదేళ్ల క్రితం చీరాలలో ఓడిపోయావు.. తర్వాత అడ్రస్ లేవు.. ఈ పదేళ్లలో మంచి అయినా.. చెడు అయినా మాకు సాంబశివరావే అండగా ఉన్నారు... ఇప్పుడు వచ్చావు.. మళ్లీ ఎన్నికల తర్వాత అసలు నువ్వు ఇక్కడ ఉంటావో లేవో తెలియదు అని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. దీంతో తెల్లబోవడం బాలాజీ వంతు అవుతోంది.
నియోజకవర్గం మొత్తం మీద వైసీపీ కంచుకోటల్లాంటి గ్రామాల్లో కూడా వైసీపీ అనుకూల ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఏలూరి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆరు నెలలుగా ఇదో నిర్విరామ యజ్నంలా జరుగుతోంది. ఓవరాల్‌గా పరుచూరులో ఏలూరి గెలుపు మీద పందాలు దొరకడం లేదు. చివరకు మెజార్టీ లెక్క చూస్తే రెండు నెలల క్రితం 10 వేలతో మొదలైన లెక్క ఇప్పుడు 25 - 30 దాటేసి 35 - 40 వేల మధ్యలో నడుస్తోందంటే ఇక్కడ ఏలూరి హవా ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. బాపట్ల పార్లమెంటులో టీడీపీకి వచ్చే మెజార్టీలో పరుచూరు మెజార్టీ చాలా కీ రోల్ పోషిస్తోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.