- టిడిపి కంచుకోట కూలుతుందా.?
- టిడిపి వర్గ పోరు వైసీపీకి ప్లస్ అవుతుందా.?
- ఉండిలో ఉండేదెవరు పోయేదెవరు.?


పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో రసవత్తరమైన పోరు జరుగుతుంది. వైసిపి పార్టీ నుంచి సివిఎల్ నరసింహారాజు, టిడిపి పార్టీ నుంచి రఘురామకృష్ణం రాజు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వేటుకూరి వెంకట శివరామరాజు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ముగ్గురు రాజుల మధ్య వార్ ఏర్పడింది. మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారు. వారి బలబలాలు ఏంటి అనేది తెలుసుకుందాం.. ఉండి నియోజకవర్గం టిడిపికి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే ఒక్కసారి మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఇక్కడ తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఏకంగా ఎనిమిది సార్లు టిడిపి విజయ డంకా మోగించింది.


 అలాంటి ఈ కంచుకోటలో టిడిపి ఓడిపోయే పరిస్థితికి వచ్చింది దీనికి ప్రధాన కారణం ఒక వ్యక్తి ఆయనే వేటుకూరి వెంకట శివరామరాజు.2009లో పోటీ చేసి ఈయన గెలుపొందారు.మళ్లీ 2014 కూడా ఈయనే గెలిచారు. ఒకప్పుడు కలవపూడి శివ, మంతెన రామరాజు  మంచి మిత్రులు. గురు శిష్యులైన వీరిద్దరికి 2019 ఎలక్షన్స్ లోనే వైరం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీ సీట్లు రఘు రామ కృష్ణంరాజుకు చంద్రబాబు ఇచ్చారు. కానీ చివరి సమయంలో చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి  వైసీపీలో చేరారు. ఈ సమయంలోనే తన ప్రధాన అనుచరుడైన మంతెన రామరాజును, శివరామరాజు చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి ఎంపీ సీట్ ఇవ్వాలని అడిగారట.

కానీ ఆ సమయంలో చంద్రబాబు మీరు ఎంపీగా పోటీ చేయండి మీ శిష్యుడు రామరాజుకు  ఉండి టికెట్ ఇద్దామని చెప్పారట. దీంతో ఉండి నియోజకవర్గంలో రాజకీయాలన్ని మార్పు చెందాయి. ఆ ఎన్నికల్లో శివరామరాజు ఓడిపోయి మంతెన రామరాజు ఉండిలో గెలిచారు. ఇక అప్పటి నుంచి వీరి మధ్య విపరీతమైన వర్గ పోరు ఏర్పడుతూ వస్తోంది. మంతెన రామరాజు, శివరామరాజు మధ్య పోటీ వల్ల ఆ టికెట్ చివరికి చంద్రబాబు రఘురామ కృష్ణంరాజు కేటాయించారు. దీంతో మంతెన రామరాజు ఏమి చేయలేక రఘురామకృష్ణరాజుకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక వెంకట శివరామరాజు తనకు టికెట్ ఇవ్వలేదన్న కోపంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో అక్కడ ముగ్గురు కీలక లీడర్ల మధ్య  పోటీ ఏర్పడింది.

వైసిపి:
బలాలు:

గతంలో ఓడిపోయిన సింపతి.
వైసిపి చేసినటువంటి అభివృద్ధి పనులు.
టిడిపిలో ఏర్పడిన వర్గ పోరు.

బలహీనతలు:
టిడిపి ఓట్లు ఎక్కువగా ఉండడం.
వైసిపికి క్యాడర్ తక్కువగా ఉండడం.

టిడిపి:
బలాలు:

టిడిపి కంచుకోట.
ప్రభుత్వంపై వ్యతిరేకత.

బలహీనతలు:
టిడిపి నాయకుల మధ్య ఏర్పడిన వర్గ పోరు.
టిడిపి ఓట్ల చీలిక.

ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ:
బలాలు:

వైసిపి, టిడిపి మధ్య ఓట్ల చీలిక.
శివరామరాజు సొంత ఇమేజ్.

బలహీనతలు:
టిడిపిని వీడి బయటకు రావడం.
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అంటే ఎవరికి తెలియకపోవడం.

మరింత సమాచారం తెలుసుకోండి: