రాజకీయ నేతలలో ఎక్కువమంది నీతినిజాయితీ కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ కొందరు నేతలు మాత్రం విలువలకు కట్టుబడి రాజకీయాలు చేస్తుంటారు. అలాంటి నేతలలో ముదునూరి ప్రసాదరాజు ముందువరసలో ఉంటారు. 2004 సంవత్సరం నుంచి ముదునూరి ప్రసాదరాజు రాజకీయాల్లో ఉన్నా వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలవలేదు. 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ముదునూరి ప్రసాదరాజు ఓటమిపాలయ్యారు.
 
నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2004లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన ప్రసాదరాజు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 17,325 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచిన ప్రసాదరాజు 2012 ఉపఎన్నికలో ఓటమిపాలయ్యారు. 2014 సంవత్సరంలో ఆచంట నియోజకవర్గం నుంచి లక్ పరీక్షించుకున్న ప్రసాదరాజుకు ఆ ఎన్నికల్లో సైతం షాక్ తగిలింది.
 
వరుస ఓటములు ఎదురవుతున్నా ధైర్యాన్ని కోల్పోకుండా 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి నరసాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో నర్సాపురంలో వైసీపీ నుంచి ప్రసాదరాజుకే టికెట్ దక్కగా జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ పోటీ చేస్తున్నారు. వరుసగా రెండుసార్లు గెలవలేదనే సెంటిమెంట్ ను ప్రసాదరాజు బ్రేక్ చేస్తాడని అందరూ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
 
ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీని డిసైడ్ చేయడం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ ఎక్కువ స్థానాల్లో గెలిచిన పార్టీకే అధికారం దక్కగా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది. బొమ్మిడి నాయకర్ ఎమ్మెల్యేగా గెలవవచ్చని స్థానికంగా వినిపిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం ఒకటి కావడం గమనార్హం. అటు ముదునూరి ప్రసాదరాజు ఇటు నాయకర్ గెలుపు కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. జగన్ కు నమ్మిన బంటుగా పేరున్న ముదునూరి మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తారో లేదో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: