ఆ తర్వాత అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధాన మోడీకి సైతం స్వాగతం పలికి ఆహ్వానించడంతో ఈ వేదిక మరింత హైలెట్గా నిలుస్తోంది.అనంతరం మోడీ కాళ్లకు సైతం పవన్ కళ్యాణ్ నమస్కరించబోతూ ఉండగా అలాంటివి వద్దంటూ మోడీ నిరాకరించారు.. ముఖ్యంగా కాళ్లకు నమస్కారం మీలాంటి నేతలు చేయకూడదంటూ జనసేనకి చెబుతూ పవన్ ను కేవలం పలకరించారు అయితే సన్నివేశం చూసిన ఇరువురు పార్టీ నేతలు సైతం ఆనందాన్ని వెల్లడిస్తున్నారు.
కూటమిలో భాగంగా అటు బిజెపి జనసేన టిడిపి పార్టీలు సైతం మూకుమ్మడిగా ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు.. కేవలం వైసీపీ పార్టీని ఎదుర్కోవడం కోసమే ఇలా ఎన్నో పన్నాగాలు పడుతున్నారు.. ఎన్నికలకు మరో ఆరు రోజుల వ్యవధి ఉండంగానే మోడీ సభ ఏ విధంగా ప్రజలను సైతం ఆకట్టుకుంటుందో చూడాలి మరి.. ముఖ్యంగా ఈసారి ఎన్నికల సైతం అన్ని పార్టీలకు చాలా కీలకంగా మారనున్నాయి. బిజెపి కూడా ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది.. కానీ ముస్లింల పైన రిజర్వేషన్లు విషయం పైన కాస్త విమర్శలు వినిపిస్తున్నప్పటికీ అయినా కూడా వాటినేటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది బిజెపి పార్టీ. అటు తెలంగాణలో కూడా ఎన్నికల విషయంలో ఇదే కొనసాగుతోంది.