రాయలసీమలోని కడప జిల్లాలో చెయ్యేరు నది ఒడ్డున ఉన్న రాజంపేట 1952లో లోక్సభ నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే మారుతాయి. రాయలసీమలో ఈ లోక్‌సభ స్థానం చాలా ప్రత్యేకత కలిగి ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో  వైసీపీ నుంచి రాజంపేట‌ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిథున్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు.

రాజంపేటలో అత్యధిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రెండుసార్లు విజయం సాధించింది. ఇక్కడ స్వతంత్ర, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కూడా విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో, మిథున్ రెడ్డి (వైసీపీ నుండి) టీడీపీ అభ్యర్థి డి.ఎ. సత్యప్రభపై విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున మిథున్ రెడ్డి నిలిచారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి దక్కింది. రాజంపేట లోక్‌సభ పరిధిలోని పీలేరు శాసనసభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.

రాజంపేట లోక్‌సభ పరిధిలో మొత్తం 7 శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో
రాజంపేట, రైల్వేకోడూరు (ఎస్సీ), రాయచోటి, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు వంటివి ఉన్నాయి. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మదనపల్లె కాన్స్టియెన్సీ నుంచి నిషార్ అహ్మద్ కాంటెస్ట్ చేస్తున్నారు.

తంబళ్లపల్లెలో వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి బరిలోకి దిగారు. కోడూరు నుంచి వైసీపీ అభ్యర్థి కే శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. వీరిపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి ఆయా నేతలు పోటీ పడుతున్నారు. నియోజకవర్గం పరిస్థితులు ఒక్కోలాగా ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టం. ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి అన్ని నియోజకవర్గాల్లో బాగానే పరిచయాలు ఉన్నాయి. ఆయన ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: