గుడివాడ నియోజకవర్గాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకోసం అక్కడ వెనిగండ్ల రామును బరిలోకి దించింది. ఆయన భార్య ఎస్సీ సామాజిక వర్గం. దీంతో నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు వారి వైపు మళ్లే అవకాశం ఉంది. ఇక కాపులు కూడా నిర్ణయాత్మకంగా వ్యవహరించనున్నారు. దీంతో వారిని ఆకట్టుకునేందుకు ఎన్నికల ప్రచారంలో కొడాలి నాని కీలకమైన పని చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే రాజకీయ నేతల విగ్రహాలకు అధికారులు ముసుగులు కప్పుతారనే విషయం తెలిసిందే. అయితే ఎన్నికల నిబంధనలను కొడాలి నాని పూర్తిగా పక్కన పెట్టేశారు. కాపుల ఆరాధ్యనీయుడు వంగవీటి మోహన రంగా విగ్రహానికి ఆయన ముసుగు తొలగించారు. ఆయన విగ్రహానికి కొడాలి నాని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ విషయం బయటకు పొక్కినా ఎన్నికల సంఘం అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. మరో వైపు మరిన్ని ఎన్నికల నిబంధనలను కొడాలి నాని పాటించడం లేదు. తాజాగా వైసీపీ ఆత్మీయ సమావేశాన్ని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు. అయితే ఈ సమావేశం రాత్రి 10.30 గంటల వరకు కొనసాగించడం గమనార్హం. దీనిని కూడా ఎన్నికల అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇదే పద్ధతి కొనసాగితే ఎన్నికల సంఘం నిబంధనలను ఇతర నేతలు సైతం పక్కన పెట్టేస్తారని అంతా చర్చించుకుంటున్నారు. కోడ్ ఉల్లంఘనలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.