నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నారా లోకేష్ మంత్రిని చేశారు. ఆయనకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పిస్తూ పార్టీని ఎలా ముందుకు నడపాలో నేర్పించారు. అయితే చంద్రబాబు తోటి రాజకీయ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం జగన్‌ను తన వెంట పెట్టుకుని ఎప్పుడూ తిప్పలేదు. ఎలక్షన్ల వేళ ప్రచార సమయాల్లో తన కుమారుడికి తోడుగా రావడం తప్పించి ఆయనే ఎలాంటి పదవులను జగన్‌కు కట్టబెట్టలేదు. జగన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పుడే రాజశేఖర్ రెడ్డి మరణించారు. దాంతో జగన్ రాజకీయంగా రాజశేఖర్ రెడ్డి హెల్ప్ చేయడానికి ఛాన్స్ లేకుండా పోయింది.

జగన్ పాదయాత్ర వంటి విచ్చేసి ప్రజల మనసులను గెలుచుకొని సీఎంగా ఎదిగారు. కానీ ఆయన ప్రభుత్వ వ్యవస్థలను ఎలా వాడుకోవాలో రాటు తేలలేదు కానీ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు మాత్రం ప్రభుత్వ సంస్థలను తమకు అనుగుణంగా ఎలా వాడుకోవాలో బాగా తెలుసుకున్నారు. దానికి తోడు ఆయన రాజకీయ మెదడును ఉపయోగిస్తూ వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. పలు సంక్షేమ పథకాల డబ్బులు ప్రజలకు అందకుండా చంద్రబాబు ఆపగలిగారు. వాటిలో విద్యా దీవన వంటివి ఉన్నాయి.

అంతేకాదు, కీలకమైన ప్రభుత్వ అధికారులను కూడా బదిలీ చేయిస్తూ వైసీపీకి ప్రభుత్వ మద్దతు లేకుండా చేస్తున్నారు. అయితే ఇలాంటి పనులు చేయడం వల్ల వైసీపీకి మాత్రమే కాకుండా ప్రజలకు కూడా నష్టం వాటితోంది. అందువల్ల ప్రజలు బాగా కోపానికి గురవుతున్నారు ఇవన్నీ చంద్రబాబు చేస్తున్నారని తెలిసి ఆయనపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ కుమార్, టీవీ రమేష్ కుమార్ వంటి వ్యక్తులను వాడుకుంటూ వైసీపీని టార్గెట్ చేయిస్తున్నారు.జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని వాగ్దానాలు ఇస్తూ ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తం మీద అన్ని రాజకీయ వ్యూహాలను అమలుపరుస్తూ వైసిపిని ఎరకటం లో పడేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: