రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ పాలిటిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడి ప్రజలు కూడా  డిఫరెంట్ గానే ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా బీజేపీ మత, కుల రాజకీయం చేస్తుంది అని అంటారు. కానీ పక్కా కులమత రాజకీయాలు జరిగేది ఆంధ్రప్రదేశ్ లోనే. రెడ్డి, కమ్మ,  కాపు  నాయకులే పాలనలో ముందుంటారు.  పార్టీ ఏదైనా కానివ్వండి, కానీ పాలించేది వారే. కానీ ప్రస్తుతం జనాల్లో మార్పు వచ్చింది. కుల, మత జనాభా ధమాషా ప్రకారం సీట్లు ఇవ్వాలని అడుగుతున్నారు. దీంతో పది సంవత్సరాల రాజకీయాలకు, ప్రస్తుత రాజకీయాలకు తేడా అయితే వచ్చింది. జనాలు కూడా చాలా అప్డేట్ అయ్యారు. ప్రస్తుత కాలంలో వారు ఎటు ఓటు వేస్తారనేది చెప్పడం కష్టంగా మారింది. ఏ పార్టీకైనా డబ్బులు తీసుకునే ప్రచారం చేస్తున్నారు. దీంతో గెలిచిన రాజకీయ నాయకులు కూడా  వారు పెట్టిన ఖర్చుతో పాటు, త్రిబుల్ రేట్లు  సంపాదించుకొని వెనకేసుకుంటున్నారు.

 ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్న ఈ కాలంలో జగన్ న్యాయమైన రాజకీయం చేయాలని, ఉచిత హామీలు ఇవ్వద్దనేలా ఆలోచించారు. ప్రజలను ఆకట్టుకునేలా కొత్త పథకాలు ఏమీ తీసుకురాలేదు. కేవలం పాత పథకాలనే కొనసాగింపుగా మళ్లీ అందిస్తానంటున్నారు.  ఆయన ఏది కొత్తగా తీసుకురాకపోవడంతో ఆయన గురించి ఆలోచించడం మరిచారు.  ఇక ఇదే అదునుగా భావించిన టిడిపి, రైతులను, సాధారణ ప్రజలను,  ఉద్యోగులను,  విద్యార్థులను, అన్ని రంగాల వారిని ఆకట్టుకునేలా సరికొత్త పథకాలు తీసుకువచ్చింది. అంటే రాష్ట్ర బడ్జెట్ లో ఇది అమలు చేయడం కష్టమే.కానీ అప్పు తీసుకొస్తే మాత్రం తప్పక అమలు చేయవచ్చు. దానివల్ల ప్రజలకు కాస్త మేలు కలుగుతుంది. సాధారణంగా ప్రజలు మాత్రం రాష్ట్రానికి ఎంత అప్పు అవుతుంది  ఆ తర్వాత రాష్ట్ర మనుగడ ఇబ్బందువుతుందనేది అస్సలు పట్టించుకోరు. మాకు ప్రభుత్వం నుంచి ఏమి వస్తుంది, ఎంత వస్తుంది అనేది మాత్రమే ఆలోచన చేస్తారు. ఇచ్చిన వాళ్ళనే గొప్ప అంటారు.

ఇదే పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు సరికొత్త పథకాలు తీసుకువచ్చి జనాల్లో కాస్త ఆలోచన వచ్చేలా చేశారు. జగన్ మాత్రం ప్రజలను ఆకర్షించే పథకాల విషయంలో కాస్త తప్పటడుగు వేశారు. ఇదే టిడిపికి ఫేవర్ గా మారే అవకాశం గా కనిపిస్తోంది. ఒకవేళ ప్రజలు జగన్ చేసిన ఆలోచన కరెక్టే అనుకుంటే జగన్ ఐదేళ్ల పాలనలో గ్రామ సర్పంచుల నుంచి మొదలు మంత్రుల వరకు ఎంతోమంది ప్రజా సొమ్ముతో ఎదిగారు. వారంతా ఎక్కడి నుంచి దోచుకున్నారు అప్పుడు రాష్ట్రం అప్పుల పాలు  కాలేదా..?  చంద్రబాబు తీసుకొచ్చిన పథకాల వల్ల అప్పుల పాలు అనుకుంటే ఈ నాయకులు ఐదేళ్లలో ఎదిగిన విధానం చూస్తే రాష్ట్రం నష్టపోదా అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. జగన్ పథకాల విషయంలో కాస్త ఆలోచన చేసి ఉంటే మాత్రం మరోసారి ఆయన తప్పక అధికారంలోకి వచ్చేవారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడిన టైట్ పొజిషన్ అస్సలు ఉండేది కాదేమో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: