మామూలుగా చూస్తే ఇద్దరు బీసీ మహిళలే.. ఇటు రజనీ భర్త కాపు, అటు మాధవి భర్త కమ్మ. భర్తలు ఇద్దరూ రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారే. ఇటు పశ్చిమలో కాపులతో పాటు కమ్మ ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే రజనీకి చాలా అడ్వాంటేజ్‌లు ఉన్నాయి. ప్రచారంలోనూ, వ్యూహాల్లోనూ, ఎత్తులు, పై ఎత్తుల్లోనూ ఆమె మాధవికి అందనంత ఎత్తులో ఉన్నారన్నది నిజం.
రజనీ చిలకలూరిపేటలో ఎలాంటి డేరింగ్ రాజకీయం చేసి గెలిచిందో.. ఇప్పుడు పశ్చిమలోనూ అంతే డేరింగ్.. అదే చాకచక్యంతో ప్రజల్లోకి దూసుకుపోతోంది. అసలు చాలా మంది మహామహులు అయిన సీనియర్ నేతలకే లేని బలమైన వాయిస్ రజనీకి ఉన్న ప్లస్ పాయింట్. అటు ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ గల్లా మాధవి రజనీ ముందు అన్ని విషయాల్లోనూ తేలిపోతున్నారు.
దీనికి తోడు రజనీ ఆల్రెడీ ఫ్రూవ్ చేసుకున్న పొలిటిషీయన్. ఆమె మాట ఇచ్చారంటే చాలు తన సొంత నిధులతో అయినా ఆ పని చేసి పడేస్తారన్న పేరుంది. ఇక మాస్‌లో.. ఇంకా చెప్పాలంటే ఊరమాస్‌లోనూ ఆమెకు పట్టుంది.. క్రేజ్ ఉంది. మా రజనమ్మమా అని పిలుచుకునేంత కాడకు ఆమె పేరు వెళ్లిపోయింది. ఆర్థికంగా దూకుడుగా ఉండడం... కనివినీ ఎరుగని రేంజ్‌లో నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవడంతో ప్రత్యర్థులు ఆమె ముందే బేల చూపులు చూడడం మినహా చేసేదేం లేదు.
అసలు గుంటూరు పార్లమెంటుకు టీడీపీ నుంచి ఎన్నారై ఆర్థికంగా బలంగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ పోటీలో ఉండబట్టి గుంటూరు పశ్చిమలో టీడీపీ ఈ మాత్రం అయినా పోటీ ఇస్తేందో తప్పా... లేకపోతే ఈ పాటికే ఎప్పుడో వాళ్లంతా చాపచుట్టేసేవారు. ఓవరాల్‌గా పోల్ మేనేజ్మెంట్ వైఫల్యం, రజనీ పట్టుదలతో ఈ సీటు వైసీపీ ఖాతాలో పడే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.