గొడ్డలితో మిగతా వాళ్లనూ నరికేయండంటూ భారతిని టార్గెట్ చేస్తూ షర్మిల ఒకింత ఘాటు విమర్శలు చేశారు. ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే నాకు ఓటెయ్యాలని మీ ఎంపీని జైలులో కలవాలంటే అవినాష్ రెడ్డికి ఓటెయ్యాలని ఆమె అన్నారు. దేవుడు మా వైపే ఉంటాడని గొడ్డలితో నరికే వాళ్ల వైపు కాదని కామెంట్లు చేశారు. అయితే విమర్శలకు అడ్డూఅదుపు లేదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కోర్టు పరిధిలో కేసు ఉందని తుది తీర్పు వెలువడకుండానే రాజకీయ ప్రయోజనాల కోసం షర్మిల అవినాష్ ను, జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కడప ప్రజల్లో తమ కుటుంబానికి, తమ పార్టీకి మంచి పేరు ఉందని అందువల్ల ఇక్కడి ప్రజలు తమ పార్టీకే మద్దతు ఇస్తారని భారతి చెప్పడం కూడా తప్పా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అధికారమే పరమావధిగా షర్మిల తోడబుట్టిన అన్ననే దారుణంగా టార్గెట్ చేస్తున్నారని విమర్శలలో షర్మిల బాబు, పవన్ లను మించిపోయారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని మోదీ ఏపీపై కపట ప్రేమ చూపిస్తున్నారని షర్మిల అన్నారు. ఏపీ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆయనకు రేడియో గిఫ్ట్ గా పంపానని ఏపీ ప్రజల మన్ కీ బాత్ మోదీ వినాలని షర్మిల చెప్పుకొచ్చారు. షర్మిల కామెంట్లు ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.