ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ.. టీవీ9 కి ఇంటర్వ్యూ ఇచ్చారు.. మరొక పక్కన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏబీఎన్ రాధాకృష్ణ గారితో ఇంటర్వ్యూ ఇచ్చారు. రేటింగులు విషయానికి వస్తే ఈరోజు వస్తాయి.. ఇలా అన్ని ప్రోగ్రాములు అవి కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ తో తెలిసే అంశం ఏమిటంటే.. అప్పుడు వచ్చేటువంటి రేటింగ్. టీవీ9 కి సంబంధించి అన్ని రికార్డు సైతం బద్దలయ్యాయంటూ తెలిపారు. మొన్న కెసిఆర్ ఇంటర్వ్యూ లైవ్ ది. 52,000 మంది హైయెస్ట్ గా చూశారట. ఆరోజున వాళ్లు అదే కంపేర్ చేసుకుని తెలియజేశారు.
నిన్నటి రోజున జగన్ది రికార్డెడ్ ఇంటర్వ్యూ అంటూ రజనీకాంత్ తెలియజేశారు. ఏకంగా ఈ ఇంటర్వ్యూ ని 63,000 మంది చూశారట.. అలాగే టీవీ9 కి సంబంధించి డైరెక్ట్ గా ఒక లింకు ఇచ్చారు.. విడిగా ఒక లింక్ ఇచ్చారు.. 23 వేల మంది చూశారట.. ఇలా రెండు కలుపుకొని చాలామంది చూశారు. అదే సందర్భంలో abn రాధ కృష్ణ గారి డెబిట్ లో చంద్రబాబు పాల్గొన్నప్పుడు.. ఒకపక్క 21,000 మంది.. 7,000 మంది.. చూశారు. బేసిగ్గా ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే జగన్ చేస్తున్న పనిని చూసి చంద్రబాబు కూడా వాత పెట్టుకుంటున్నారు.. ప్రజలలో ఎక్కడ ఇమేజ్ జగన్ కి పెరుగుతుందని ఉద్దేశాన్ని తను కూడా ఏం చేస్తే చంద్రబాబు అదే పని చేస్తున్నారు. దీనివల్ల చంద్రబాబు ట్రోల్ కి గురవుతున్న సందర్భాలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం టాప్ రేటింగ్ లో ఎవరున్నారని విషయానికి వస్తే.. టీవీ9, ఎన్టీవీ, సాక్షి.. ఆ తర్వాత స్థానాలలో టీవీ5 ,ఏబీఎన్ ఇతరత్న చానల్స్ ఉన్నాయి.