2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు దక్కించుకున్న ఏలూరి.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని అణువణువునా నింపుకొన్నారు. అందుకే ఆయనను కలవాలన్నా, సమస్యలపై విన్నవించు కోవాలన్నా ప్రత్యేకంగా వేరే ఎవరినో కలవాల్సిన అవసరం లేదు. ఆయన ఫోన్ నెంబరు నియోజకవ ర్గంలోని ప్రతి ఒక్కరి దగ్గరా ఉంటుంది. ఇక, వ్యవసాయ రంగం నుంచి విద్యా రంగం వరకు ఏలూరి అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు.
ఫలితంగా నియోజకవర్గంలో ఏలూరి అంటే తెలియనివారు.. ఆయన గురించి చర్చించని వారు లేరంటే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఈ ఎన్నికల్లో కనీస పోటీ ఇచ్చే అప్పోజిషనే లేకుండా పోయిన నలుగురైదుగురు టీడీపీ ఎమ్మెల్యేల్లో ఏలూరి టాప్ ప్లేస్‌లో ఉండడం గమనార్హం. ఆయనకు నియోజకవర్గంలో అసమ్మతి లేదు. వర్గ పోరు లేదు. కుల రాహిత్యంలేదు. మత జంఝాటం అంతకన్నా లేదు. అందరూ ఆయన మనుషులే.. అందరివాడుగా.. ఆయన ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. ఇదే ఏలూరికి కని వినీ ఎరుగని రీతిలో అభిమానులను పెంచింది.
మరీ ముఖ్యంగా ఆయన తనకు ఎదురైన అవాంతరాలను కూడా.. ఛేదించుకుని ముందుకు సాగుతున్నా రు. సర్కారు నుంచి వ్యాపారాల విషయంలో అనేక ఇబ్బందులు ఎదరైనా..ఎక్కడా వెన్ను చూపకుండా పోరాటం సాగించారు. ఇది మరింతగా ఏలూరి కి క్రేజ్ పెంచేసింది. చివరకు.. ఈయనను ఓడించేందుకు వైసీపీ చేసిన ప్రయోగాలు కూడా విఫలం కావడం.. అభ్యర్థులను మార్చడం.. చివరకు ఎవరూ దొరకక.. ఎప్పుడో పదేళ్లక్రిత్రం ఎన్నికల్లో పోటీ చేసి తర్వాత అడ్రస్ లేకుండా ఉన్న నేతనే తీసుకువచ్చి పెట్టే పరిస్తితి వచ్చిందంటేనే.. ఏలూరి హవా ఆయన క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరి పేరు మార్మోగుతోంది.