• మొదలైన ప్రలోభాల హోరు
•విజయం సాధించేది ఎవరు.?
ఇంకా మూడు రోజుల్లో ఎలక్షన్స్..ఇప్పటికే నాయకులంతా గత కొన్ని నెలల నుంచి నియోజకవర్గాల్లో తిరిగి తిరిగి, ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. ఇన్ని రోజులు గల్లీల నుంచి పట్టణాల వరకు మోగినటువంటి మైకులు ఆగిపోయాయి. ఎక్కడ చూసినా మొత్తం సైలెంట్ గా ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలకు ఏదో ఒక విధంగా డబ్బు ప్రలోభం చేస్తూ ఓట్లను కొనే ప్రయత్నంలో ఉన్నారు నేతలంతా. ప్రస్తుతం పార్టీలో పనిచేసే కిందిస్థాయి నాయకులకు, కార్యకర్తలకు డబ్బాందేది ఇప్పుడే.. ఇన్ని రోజులు కష్టపడ్డారు. ప్రస్తుతం డబ్బు చేతిలోకి వచ్చేసరికి వారి మనసు మారుతుందట.. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎలాగైనా గెలవరని భావించి చాలామంది నేతలు వచ్చిన డబ్బును ప్రజలకి పంచకుండా వారి దగ్గరే ఉంచేసుకుంటున్నారని తెలుస్తోంది. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందట.