ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఎక్కువ  కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీయే. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు ఉండేది కాదు. ఎప్పుడైతే టిడిపి పార్టీ అక్కడ ఎంట్రీ ఇచ్చిందో  అప్పటినుంచి ఏపీలో టిడిపి వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. అలాకొన్ని పర్యాయాలు కొనసాగింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా అవతరించింది. దీన్ని జగన్  స్థాపించి బాస్ గా ఉన్నారు. అంతే కాకుండా మధ్యలో  చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. ఇది కూడా నిలబడలేక, చివరికి కాంగ్రెస్ లో విలీనమైంది. అప్పటినుంచి టిడిపి వర్సెస్ వైసీపీ అనే విధంగా కొనసాగుతూ వస్తున్న తరుణంలోనే  అనూహ్యంగా పార్టీ పెట్టి  ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. 

జనసేన పార్టీ ద్వారా  రాష్ట్రంలో ఎంతో కొంత ఓటు బ్యాంకును సంపాదించుకున్నారు. అంతేకాదు ఆయనే ఈ రెండు పార్టీలకు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారారు. గత 2019 ఎన్నికల్లో చాలా ప్రాంతాల్లో జనసేన కూడా పోటీ చేసింది. ఆ టైంలో టిడిపి ఓట్లు కొన్ని జనసేనకు టర్నవడంతో అక్కడ వైసిపి ఏకధాటిగా విజయం సాధించింది.  ఇది గమనించినటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి జనసేనతో  పొత్తు కలుపుకున్నారు. అయితే టిడిపి ఓడిపోయిన ప్లేసులో చాలా వరకు  2000- 10000 లోపు తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు.  అంటే జనసేన ఓట్లు  చీల్చేసిందని అర్థం చేసుకున్న  టిడిపి అధినేత చంద్రబాబు ముందుగానే వారితో జతకట్టి, ఇక జగన్ కు ఎలాంటి అస్త్రం లేకుండా, బిజెపితో కూడా జతకట్టాడు. ఇదే తరుణంలో జగన్ కు మింగుడు పడకుండా అయిపోయింది. పోయిన ఎన్నికల్లో ఓట్లు చీల్చిన జనసేన  ఈసారి టిడిపితో జత కట్టడం వల్ల చాలా వరకు ఓట్లు టిడిపి వైపు వెళ్తాయని జగన్ మదన పడుతున్నట్టు తెలుస్తోంది.

అందుకే ఆయన జనసేన పార్టీతో  పొత్తు పెట్టుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ససేమిరా అనడంతో అంతటితో ఆగిపోయారు. 2019 ఎన్నికలకు ముందు కూడా జనసేనతో కలిసి వెళ్దామని, జగన్మోహన్ రెడ్డి అనేక రాయబారాలు పవన్ కు పంపారట. కానీ పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదట.  ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో   బయటపెట్టారు. అంతే కాకుండా ఈ ఎలక్షన్స్ కు ముందు కూడా పవన్ తో పొత్తు పెట్టుకోవడం కోసం జగన్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో  జగన్ సైలెంట్ అయిపోయారట. అయితే పవన్ తో పొత్తు పెట్టుకుంటే ఇక టిడిపి పూర్తిగా కుప్పకూలిపోతుంది. వైసీపీకి ఎదురు ఉండదు  అని భావించిన జగన్ ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఈ విధంగా సీఎం జగన్ జనసేన పార్టీకి భయపడుతున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: